హైదరాబాద్) అసెంబ్లీ ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలల దుస్థితి మీద వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ప్రస్తావించారు. నెల్లూరు నగరంలోని అనేక పాఠశాలల్లో పారిశుధ్య వసతులు లేవని సభ దృష్టికి తీసుకొని వచ్చారు. మునిసిపల్ మంత్రి నారాయణ దత్తత తీసుకొన్న వార్డులో కూడా పరిస్థితి దయనీయంగా ఉందని తెలిపారు. ఏడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఎమ్మెల్యేను అని చెప్పుకొనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నియోజక వర్గం అయిన కుప్పంలో తమ బృందం పర్యటించిందని చెప్పారు. అక్కడ పాఠశాలల్లో కూడా దయనీయమైన పరిస్థితి నెలకొందని చెప్పారు. అందుకు సంబంధించి ఫోటోలు చూపించారు. అందుచేత కుప్పం నియోజక వర్గాన్ని రోడ్ మోడల్ గా చేసుకొని పాఠశాలల్లో పరిస్థితుల్ని మెరుగు పరచాలని కోరారు.. <br/>