అస్వస్థతకు గురైనా ఆగ‌ని అడుగులు
- ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో కొన‌సాగుతున్న జ‌న‌నేత‌ పాద‌యాత్ర‌
- వైయ‌స్ జ‌గ‌న్‌కు మూడు రోజులుగా జ్వ‌రం
- వ‌డ‌దెబ్బ‌కు గురైన లెక్క చేయ‌ని రాజ‌న్న‌ బిడ్డ‌
  
ప‌శ్చిమ గోదావ‌రి : వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర దిగ్విజ‌యంగా సాగుతోంది. గ‌తేడాది న‌వంబ‌ర్‌ 6వ తేదీ వైయ‌స్ఆర్ జిల్లా ఇడుపుల‌పాయ‌లో ప్రారంభ‌మైన పాద‌యాత్ర ఇప్ప‌టికి 176వ రోజుకు చేరుకుంది. వైయ‌స్ జ‌గ‌న్ ఏ గ్రామానికి వెళ్లిన ప్ర‌జ‌లు ఎదురెళ్లి ఘ‌న స్వాగ‌తం ప‌లుకుతున్నారు.  వడగాడ్పుకు అస్వస్థతకు గురైనా.. సడలని సంకల్పంతో జనక్షేమమే ధ్యేయంగా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముందడుగువేస్తున్నారు. వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆయన ఉదయం నుంచీ జలుబు, జ్వరం, తలనొప్పితో బాధపడ్డారు.అయినప్పటికీ పశ్చిమగోదావరి జిల్లాలో పాదయాత్ర కొనసాగించారు. మంగళవారం పాదయాత్ర ముగిసిన తర్వాత వైయ‌స్ జగన్‌ ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన వైద్యులు మూడు రోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని ఆయనకు సూచించారు. రోజూ ఎండలోనే పాదయాత్ర చేస్తున్నందున ఆదివారం తమ వడదెబ్బకు గురయ్యారు. అయిప్ప‌టికీ లెక్క చేయ‌కుండా ప్ర‌జ‌ల క‌ష్టాలు తెలుసుకోవ‌డ‌మే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. బుధ‌వారం ఉద‌యం వైయ‌స్‌ జగన్ పాదయాత్రను పశ్చిమ గోదావరి జిల్లా కొప్పర్రు శివారు నుంచి ప్రారంభించారు. ఇవాళ‌ కొప్పర్రు నుంచి లిఖితపూడి, సరిపల్లి, చిన మామిడిపల్లి, నరసాపురం, స్టీమర్‌ రోడ్డు వరకూ వైయ‌స్‌ జగన్‌ ప్రజాసంకల్పయాత్ర చేస్తారు.  

దారుల‌న్నీ సంద్ర‌మే...
వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌మ గ్రామానికి వ‌స్తున్నార‌ని తెలుసుకున్న ప్ర‌జ‌లు పనులు మానుకొని, ఎదురెళ్లి ఘ‌న స్వాగ‌తం ప‌లుకుతున్నారు. పూల‌వ‌ర్షం కురిపించి, హార‌తులు ప‌ట్టి అభిమానం చాటుకుంటున్నారు. ఏ ఊరికి వెళ్లినా జనం పోటెత్తుతున్నారు. చిన్న గ్రామాల మీదుగా యాత్ర సాగినా ప్రజలు వేలాదిగా తరలివచ్చి పాదయాత్రకు సంఘీభావం తెలుపుతున్నారు. గ్రామాల్లో ఏ మిద్దె చూసినా, ఏ వీధి చూసినా, ఏ రహదారి చూసినా జనాలతో కిక్కిరిసిపోతున్నాయి. రాజ‌న్న బిడ్డ‌తో కరచాలనం చేసేందుకు యువత పోటీపడుతున్నారు. మ‌హిళ‌లు, వృద్దులు జ‌న‌నేత‌ను ఆప్యాయంగా ప‌ల‌క‌రించి త‌మ బాధ‌లు చెప్పుకుంటున్నారు. చివరకు భద్రతా సిబ్బందిని సైతం నెట్టేసి జననేతతో కరచాలనం చేసేందుకు దూసుకురావడంతో వారిని ఆపడం ఎవరితరం కావ‌డం లేదు. వైయ‌స్  జగన్‌ కల్పించుకుని అభిమానులతో ఫొటోలు, సెల్ఫీలు దిగడంతోపాటు కరచాలనం చేసి వారికి అప్యాయతను పంచుతున్నారు.. అక్కాచెల్లెళ్లు ఎక్కడికక్కడ వైయ‌స్ జగన్‌కు హారతులిచ్చి, రాఖీలు కట్టి స్వాగతం పలుకుతున్నారు.  కూలీలు, రైతులు పనులు మానుకుని వచ్చి పాదయాత్రలో పాల్గొంటున్నారు. వృద్ధులు, వికలాంగులు, అన్నదాతలు, అక్కాచెల్లెళ్లు ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో తాము పడుతున్న కష్టాలను వైయ‌స్ జగన్‌కు  చెప్పుకుంటున్నారు.  ప్రజా సమస్యలను తెలుసుకుంటూ, వారికి భరోసా ఇస్తూ వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అలుపు, సొలుపు లేకుండా ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మ‌వుతూ ముందుకు సాగుతున్నారు.   
Back to Top