చంద్రబాబు దళిత వ్యతిరేకి

  • మహానేత పథకాలకు తూట్లు
  • దళితులంతా వైయస్‌ఆర్‌సీపీ గొడుగు కిందే
  • వైయస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో అంబేడ్కర్, బాబు జగ్జీవన్‌రామ్‌ జయంతి వేడుకలు
హైదరాబాద్‌: ఏపీ సీఎం చంద్రబాబు దళిత వ్యతిరేకి అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున మండిపడ్డారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ రచించిన రాజ్యాంగాన్ని టీడీపీ ప్రభుత్వం అపహాస్యం చేస్తుందని ఆయన ధ్వజమెత్తారు. సోమవారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్రం కార్యాలయంలో ఎస్సీ విభాగం కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్‌ అంబేడ్కర్, బాబు జగ్జీవన్‌రామ్‌ జయంతి వేడుకల నిర్వాహణ, దళితుల సమస్యలపై చేపట్టే ఉద్యమాలపై చర్చించారు. అనంతరం మేరుగ నాగార్జున మీడియాతో మాట్లాడారు. ‘‘దళితులుగా ఎవరు పుడతారని’’ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు అనడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. దళితులకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన వాటా ఇవ్వడం లేదని విమర్శించారు. సబ్‌ప్లాన్‌లో నిధులు వెచ్చించడంలో చంద్రబాబు విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి దళితులకు మంజూరవుతున్న నిధులు ఖర్చు చేయకుండా ఇతర శాఖలకు కేటాయిస్తున్నారని విమర్శించారు. టీడీపీ పాలనలో దళితులు మోసపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబుది దళిత వ్యతిరేక ఆలోచన శైలి అని అభివర్ణించారు. 

నాడు దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి  ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతిది దళితులకు మేలు జరిగిందన్నారు. దళిత సంక్షేమాన్ని, అంబేడ్కర్‌ ఆలోచన విధానాన్ని పుణికిపుచ్చుకున్న ముఖ్యమంత్రిగా వైయస్‌ రాజశేఖరరెడ్డి చరిత్ర పుటల్లో నిలిచిపోయారని కొనియాడారు. చంద్రబాబు దానికి పూర్తి విరోదంగా పనిచేస్తున్నారని విమర్శించారు.‡దళితులకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన నిధుల్లో కోత విధిస్తున్నారని, చట్టాలను అపహాస్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. వైయస్‌ఆర్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు తూట్లు పొడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైయస్‌ఆర్‌ ఆలోచన విధానాన్ని చంద్రబాబు విస్మరిస్తున్నారని ఫైర్‌ అయ్యారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి నాడు దళితుల సంక్షేమానికి పెద్ద పీట వేశారని గుర్తు చేశారు. నాడు వైయస్‌ఆర్‌ 40 లక్షల ఇళ్లు కడితే దళితులకే అధికశాతం మంజూరు చేశారని తెలిపారు. 32 లక్షల ఎకరాల భూమిని వైయస్‌ఆర్‌ దళితులకు పంపిణీ చేశారని, మూడేళ్లు అవుతున్నా చంద్రబాబు ఒక ఇల్లు కూడా కట్టించలేదని, ఎకరం భూమి ఇవ్వలేదని మండిపడ్డారు. కూడు, గూడు లేకుండా దళితులకు అన్యాయం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. చివరకు గౌరవపదంగా బతకనివ్వడం లేదు అన్నారు. ఎస్సీలుగా పుట్టాలని ఎవరైన అనుకుంటారా అని హేళన చేస్తున్నారు. మా నాయకుడు వైయస్‌ జగన్‌ నిండు అసెంబ్లీలో దళితులు, గిరిజనులకు అన్యాయం జరుగుతుందని ప్రశ్నిస్తే..అక్కడ దళితులను అడ్డంపెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారని తప్పుపట్టారు. అసెంబ్లీలో నీకు సంబంధించిన కేసులు వస్తే అంబేడ్కర్‌ జపం చేస్తున్నారని విమర్శించారు.

బాబు నైజం దళిత వ్యతిరేక విధానాలను ప్రోత్సహించడమే అన్నారు. 2016 ఏప్రిల్‌ 14వ తేదీ ఏం చేశావు?, అంబేడ్కర్‌ 125 జయంతి ఉత్సవాలు ఏం చేశారని ప్రశ్నించారు. 125 అడుగుల విగ్రహం ఏర్పాటు చేస్తామన్న హామీ ఏమైందని నిలదీశారు. అంబేడ్కర్‌ జయంతి ఉత్సవాలు చేసే అర్హత చంద్రబాబుకు లేదన్నారు. దళితుల చట్టాలను దుర్వినియోగం చేస్తున్నారని, రాజ్యాంగబద్ధంగా రావాల్సిన వాటాను కూడా సరిగా ఖర్చు చేయకుండా ఇతర శాఖలకు నిధులు మళ్లిస్తున్నారని మండిపడ్డారు. 125 సంవత్సరాల జయంతి ఉత్సవాలకు ఎంత డబ్బు వెచ్చించావని ప్రశ్నించారు. చంద్రబాబు విధానం దళితులను తాకట్టుపెట్టేలా ఉన్నాయని ఫైర్‌ అయ్యారు. రాష్ట్రంలో దళితులు, గిరిజనులు బతికే వీలు లేదా అని నిలదీశారు. దళితుల భూములను, గ్రామ కంఠకాల భూములను, డీకేటీ భూములను లాక్కుంటున్నారని ధ్వజమెత్తారు. దళిత ఎమ్మెల్యేలను డబ్బులిచ్చి కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. వైయస్‌ జగన్‌ ఒక్కరే దళితుల సమస్యలను భుజాలకెత్తుకొని నడుస్తున్నారని చెప్పారు. వైయస్‌ఆర్‌సీపీ గొడుగుకిందే దళితులు నడుస్తున్నారని తెలిపారు. అంబేడ్కర్, జగ్జీవన్‌రామ్‌ జయంతి చేసి దళితులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. దళిత హాస్టళ్లను మూసివేశారని, ఉపకార వేతకాలు చెల్లించడం లేదని, మెస్‌చార్జ్‌లు పెంచలేని చంద్రబాబు జయంతి ఉత్సవాలు చేసే అర్హత లేదని హెచ్చరించారు. దళితులపై పెట్టిన కేసులు, మోసాలపై చర్చించేందుకు వైయస్‌ఆర్‌సీపీ సిద్ధంగా ఉందన్నారు. ముమ్మాటికి దళిత వ్యతిరేకివని, దళితులకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఈ ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. వైయస్‌ఆర్‌సీపీ దళిత విభాగం రాబోయే రోజుల్లో ఎలా పనిచేయలో ప్రణాళిక రూపొందించామన్నారు. ఏప్రీల్‌ 13న విజయవాడలో 125వ జయంతి వేడుకలు, ఏప్రిల్‌ 5న ప్రతి జిల్లా కేంద్రంలో వైయస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు మేరుగ నాగార్జున వెల్లడించారు.
Back to Top