మట్టి తవ్వకాలపై అధికారులకు వినతిపత్రం

రెడ్డిగూడెం:నీరు– ప్రగతి పథకం ద్వారా ఇరిగేషన్‌ శాఖ ఆధ్వర్యంలో చెరువుల అభివృద్ది పేరుతో ఇటుక బట్టిలకు నిబంధనలకు విరుద్దంగా మట్టిని విక్రయించడమే కాకుండా అడ్డుకున్నఆయకట్టు రైతులపై తప్పుడు కేసులు బనాయిస్తున్న సంఘటనపై రైతులతో కలసి వైయస్సార్‌సీపీ నాయకులు గురువారం అధికారులను కలసి వినతి పత్రం అందజేశారు. మండలంలోని పాత నాగులూరు గ్రామంలోని కొత్త చెరువులో మట్టి తవ్వకాలు జరిపి చెరువు కట్టను అభివృద్ది చేయకుండా ఇటుక బట్టిలకు తరలిస్తున్న విషయమై అయకట్టు రైతు కొలుసు చింతయ్య ప్రశ్నించగా అతనిపై తప్పుడు కేసులు బనాయించారని కొత్తనాగులూరు గ్రామంలోని ఓటు చెరువు లో నుంచి తెలుగు తమ్ముళ్ళు అక్రమంగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని అధికారులపై అధికారాన్ని ఉపయోగిస్తూ ఇటుక బట్టిలకు మట్టిని తరలిస్తున్నారని అరోపించారు. రైతులపై తప్పుడు కేసులను బనాయిస్తున్న టీడీపీ నాయకులు అగాఢలను అరికట్టాలని ఎటువంటి అనుమతులు లేకుండా ఇటుక బట్టిలకు తరలివెళ్తున్న మట్టిని నిలుపుదల చేయాలంటూ తహశీల్దార్‌ జి. శివకుమార్, మండల ప్రత్యేకాధికారి ఆంజనేయరెడ్డి, ఎంపీడీవో బీవీ రామకృష్ణనాయక్‌లకు వైఎస్సార్‌ సీపీ నాయకులు రైతులతో కలసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో రెడ్డిగూడెం సోసైటి అధ్యక్షులు గుడిశె ప్రభాకరరెడ్డి, రెడ్డిగూడెం మండల రైతు కన్వీనర్‌ ఉయ్యూరు సత్యనారాయణరెడ్డి, ప్రభాకరరెడ్డి, రంగాపురం మాజీ ఎంపీటీసీ కుప్పిరెడ్డి వెంకటరెడ్డి, రెడ్డిగూడెం–3 ఎంపీటీసీ చాట్ల రాబర్టు, గుజ్జల కోటిరెడ్డి, కలకొండ రామారావు, కందుల హారి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Back to Top