వైయస్ జగన్ ను ఆశీర్వదించండి

  • ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి 
  • తండ్రి బాటలో నడిచి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు
  • వైయస్ఆర్ గొప్ప మానవతావాది..ఆయన బాటలోనే తనయుడు
  • బాబు ప్రజాస్వామ్య వ్యవస్థను భ్రష్టుపట్టించారు
  • ఐదుకోట్ల ఆంధ్రుల హక్కును కాలరాశారు
  • వైయస్సార్సీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి ధ్వజం
  • వైయస్ జగన్ పాదయాత్రను విజయవంతం చేయాలని పిలుపు
హైదరాబాద్ః చంద్రబాబు ప్రజాస్వామ్య వ్యవస్థను భ్రష్టుపట్టించారని వైయస్సార్సీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి మండిపడ్డారు. ఎన్నికల్లో అవినీతి సొమ్మును వెదజల్లి గెలవాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు. నంద్యాల, కడప ఎమ్మెల్సీ ఎన్నికల్లో, కాకినాడలో డబ్బులు వెదజల్లి గెలిచారన్నారు. సామాన్యులు ఎన్నికల్లో పోటే చేసే పరిస్థితి లేకుండా చేశారని బాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  బాబు కబంధ హస్తాల నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే వైయస్సార్సీపీని ఆశీర్వదించాల్సిన అవసరం ఉందని ప్రజలకు పిలుపునిచ్చారు. ఒక్కసారి వైయస్ జగన్ కు అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు.  దేశంలోనే ఎవరూ చేయని అభివృద్ధి,  సక్షేమ కార్యక్రమాలు చేసి  వైయస్ఆర్ ఓ గొప్ప మానవాతవాదిగా ఎదిగారని మేకపాటి అన్నారు. వైయస్ జగన్ కు అవకాశిమిస్తే  తండ్రి బాటలోనే నడిచి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని స్పష్టం చేశారు. హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైయస్ జగన్ అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ జిల్లాల అధ్యక్షులు, పరిశీలకులు, నియోజకవర్గాల సమన్వయకర్తలు హాజరయ్యారు. సమావేశం ముగిసిన అనంతరం మేకపాటి రాజమోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. 

నవంబర్ 2 నుంచి వైయస్ జగన్ చేపట్టనున్న పాదయాత్రపై చర్చించామని చెప్పారు. పాదయాత్ర చేసే సమయాల్లో ఆయా జిల్లాల్లో చేయాల్సిన కార్యక్రమాల గురించి చర్చించడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో వైయస్ జగన్  పార్టీ నేతల సలహాలు, సూచనలు అడిగి తెలుసుకున్నారని మేకపాటి చెప్పారు. వాటన్నంటినీ క్రోడీకరించుకొని పార్టీ పెద్దలతో చర్చించి త్వరలో వైయస్ జగన్ ఓ ప్రకటన చేస్తారని చెప్పారు. పార్టీకి కీలకమైన బూత్ కమిటీలను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. టీడీపీ ప్రలోభాలు, బెదిరింపులకు వెరవకుండా పార్టీకి నమ్మకంగా పనిచేసే వ్యక్తులకు బాధ్యతలు అప్పగించాలన్న సూచనలు చేశారన్నారు. ప్రతి చోట వైయస్సార్సీపీ జెండా ఎగిరేలా బలం సంపాదించుకోవాలన్నారు.  ప్రతి మూడు నాలుగు రోజులకి మండలంలోని ప్రజాసమస్యలను తెలుసుకొని అక్కడి అధికారులతో వాటిని  పరిష్కరించే విధంగా నాయకులు కృషి చేయాలాలని సూచించడం జరిగిందన్నారు. నవంబర్ రెండు నుంచి ఆర్నెళ్లపైగా 3 వేల కి.మీ. మేర వైయస్ జగన్ పాదయాత్ర కొనసాగుతుందని మేకపాటి తెలిపారు. 120 నియోజకవర్గాల్లో పాదయాత్ర సాగుతుందని,  మిగతా 55 నియోజకవర్గాల్లో  బస్ యాత్ర చేస్తారని చెప్పారు. ప్రతిచోట వైయస్సార్సీపీ శ్రేణులను కలుసుకొని ఉత్సాహ పరుస్తారని పేర్కొన్నారు. వచ్చే సంవత్సరం డిసెంబర్ లోనే ఎన్నికలు వచ్చే అవకాశం ఉందన్న సంకేతాల నేపథ్యంలో అంతా సిద్ధం కావాలని వైయస్ జగన్ సూచించారన్నారు.  బూత్ కమిటీలతో పాటు, కొత్త ఓటర్స్ నమోదు చేపట్టాలన్నారు. అదేవిధంగా  బోగస్ ఓట్లు సృష్టించడంతో పాటు వైయస్సార్సీపీ ఓటర్స్ ను తీసేసే కార్యక్రమం చేయడంలో బాబు సిద్ధహస్తులని, కుప్పంలో 43వేల బోగస్ ఓట్లున్నాయని ఎన్నికల కమిషనర్ చెప్పిన మాటలే అందుకు నిదర్శనమన్నారు. 

బాబు ప్రజాస్వామ్యాన్ని మంటగలిపారని మేకపాటి ధ్వజమెత్తారు.  వైయస్సార్సీపీకి చెందిన 21మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలను తీసుకొని ఏకంగా వారిలో నలుగురికి మంత్రి పదవులు ఇవ్వడం దారుణమన్నారు.  బాబు కంబంధ హస్తాల నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు వైయస్సార్సీపీని ఆదరించాలని మేకపాటి ప్రజలను కోరారు. జగన్ ను బద్నాం చేయడం, తనకు తాను గొప్పగా చెప్పుకోవడం బాబుకు అలవాటైపోయిందన్నారు.  జగన్ కు ఒక్కసారి అవకాశమిస్తే రాష్ట్రం కచ్చితంగా అభివృద్ధి చెందుతుందని, ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. వైయస్ జగన్ పాదయాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.  ప్రత్యేకహోదా వచ్చి ఉంటే మన రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెంది ఉండేదని మేకపాటి అన్నారు.  ఐదు కోట్ల ప్రజల హక్కును బాబు కాలరాశారని మండిపడ్డారు. మేధావులారా ఆలోచన చేయండి. రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని నిలదీయాలన్నారు. ప్రత్యేకహోదా కోసం వైయస్ జగన్ అహర్నిషలు శ్రమిస్తున్నారని, అందరూ కలిసిరావాలని కోరారు.  రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిన బాబును ప్రజలు క్షమించరని, తగిన గుణపాఠం చెబుతారని అన్నారు.  రాష్ట్రాన్ని విడగొట్టి అన్యాయం చేసిందే కాంగ్రెస్ అని, ఆ నాయకులకు ప్రతిపక్ష నేత గురించి మాట్లాడే హక్కు లేదని అన్నారు. రాష్ట్ర ప్రజల హక్కు కాపాడాల్సిన బాధ్యత ప్రధానిపై ఉందని అన్నారు. బాబు తన అనుకూల ప్రసార మాధ్యమాలు, పత్రికలను అడ్డుపెట్టుకొని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు.  
Back to Top