నేటి నుంచి మెగా వైద్య శిబిరాలు


 హైదరాబాద్‌: వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు,  ప్రతిపక్ష నేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మెగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తెలిపారు. ఈ నెల 16వ తేదీ నుంచి 22వ తేదీ మధ్య ఆయా ప్రాంతాల్లో పార్టీ వైద్య విభాగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు.  

ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. మెగా వైద్య శిబిరాలను ఈ నెల 18న చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో, 17న ప్రకాశం జిల్లా కొండపిలో, 18న గన్నవరంలో, 19వ తేదీ ప్రకాశం జిల్లా చీరాల, 20న విశాఖపట్నం, విజయవాడ నగరాలలో, 21న పలాస, నగరి, 22న పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. ఒక్కో పార్లమెంటు నియోజకవర్గం నుంచి 50 మంది డాక్టర్లు ఈ శిబిరాల్లో పాల్గొంటారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి దివంగత మహానేత వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ పథకం స్ఫూర్తి అని పేర్కొన్నారు. వచ్చే ఐదారు నెలల్లో గ్రామీణ ప్రాంతాల్లో కూడా మినీ వైద్య శిబిరాలను ప్రతినెలా నిర్వహించాలని భావిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ వైద్య విభాగం అధ్యక్షుడు డా. జి.శివభరత్‌రెడ్డితో పాటు డా. అశోక్, డా. ప్రసాద్, డా. బాషా, డా. గోపాలకృష్ణారెడ్డి పాల్గొన్నారు.  


తాజా వీడియోలు

Back to Top