మీ సంస్కారం ఎందుకు దిగజారుతోంది?

కనగల్(నల్గొండ) 12 ఫిబ్రవరి 2013:

ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నామమాత్రంగా విమర్శిస్తున్నారని దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి షర్మిల ధ్వజమెత్తారు. కాంగ్రెస్, టీడీపీ తప్ప మూడో పార్టీ ఉండకూడదని నిర్ణయించుకుని కుట్ర పన్ని జగనన్నను ఇబ్బందులు పెడుతున్నారని ఆమె ఆరోపించారు. మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా శ్రీమతి షర్మిల మంగళవారం సాయంత్రం నల్లగొండ నియోజకవర్గంలోని కనగల్ గ్రామం వద్ద ఏర్పాటుచేసిన భారీ బహిరంగ సభలో ఆమె ప్రసంగిస్తూ చంద్రబాబుపై నిప్పులు కురిపించారు. ఈ ప్రభుత్వానికి అధికారంలో ఉండే అర్హత లేనే లేదనీ, ఒక్కరోజు కూడా దీన్ని సహించకూడదనీ ఆయన విమర్శిస్తారని ఎద్దేవా చేశారు. అవిశ్వాసం ఎందుకు పెట్టరంటే ఆయన బదులు చెప్పరన్నారు. ఆయన మాట్లాడే మాటల్లో ఏదీ నిజముండదన్నారు. చంద్రబాబు ప్రభుత్వాన్ని విమర్శించడం శుద్ధ అబద్ధమని మండిపడ్డారు. జగనన్న అవినీతికి పాల్పడి లక్ష కోట్లు దోచుకున్నారని ఆయన ఆరోపించడం పూర్తిగా అవాస్తవమని స్పష్టంచేశారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డిగారు రాక్షసుడనీ, ఆయన పాలనలో రాష్ట్రం పూర్తిగా భ్రష్టు పట్టిందనీ అనడం పూర్తిగా అబద్ధమన్నారు.

శ్రీమతి షర్మిల ఇంకా ఏమన్నారంటే...
     'చంద్రబాబు పాలన చాలా బాగుందట. ఆయన ఎప్పుడూ ఏ ధరలూ పెంచనే లేదట. అది పూర్తిగా అవాస్తవం. చంద్రబాబు గారిది ఒకటే సిద్ధాంతం. ఒకటే అబద్ధాన్ని వందసార్లు చెప్పుకుంటూ పోతే ప్రజలు దాన్ని నమ్ముతారన్నదే ఆ సిద్ధాంతం.  మునీశ్వరుడి శాపం ఉన్న చంద్రబాబు నిజం చెబితే ఆయన తల వేయివ్రక్కలవుతుందని రాజశేఖరరెడ్డి గారు ఎప్పుడూ చెబుతుండే వారు. బాబు మాటల్లో నిజాయితీ ఉండదు.  విశ్వసనీయత కూడా లేదు.

     గుంటూరులో సాక్షి కార్యాలయం మీద దాడికి చంద్రబాబు రెచ్చగొట్టేలా మాట్లాడటమే కారణం. సాక్షి విష కన్య అనీ, అభూత కల్పనలు రాస్తోందనీ రెచ్చగొట్టేలా మాట్లాడి దాడి చేయించారు.  తన మనుషులతోనే రాళ్ళేయించి దాడిచేయించారు. మార్గదర్శిని ఒక్కమాటంటేనే ప్రజాస్వామ్యం మీద దాడి అని చంద్రబాబు అన్నారు. సాక్షి కార్యాలయం మీద ఆయన మనుషులు దాడిచేస్తే ప్రజాస్వామ్యం మీద దాడి కాదా అని ప్రశ్నిస్తున్నాం. ఇది పత్రికా స్వేచ్ఛను హరించడం కాదా అని అడుగుతున్నాం. రాజకీయాలకోసం ఇంత హేయంగా ఆలోచించాలా.. ఇంత దౌర్భాగ్యంగా వ్యవహరించాలా అని కూడా అడుగుతున్నా. రోజురోజుకూ మీ సంస్కారం ఎందుకు దిగజారిపోతోందని అడుగుతున్నాం.


     రాజన్న కుమారుడు జగనన్న ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంటుంటే తమ రెండు పార్టీకు ఇక స్థానం ఉండదని కంగారు పడిన కాంగ్రెస్ టీడీపీలు కుట్ర ఓర్వలేక కుట్రలు పన్ని జైలులో పెట్టారు.  సీబీఐ కేంద్రం చేతిలో కీలుబొమ్మ. ఈ విషయాన్ని ఆ సంస్థ మాజీ డైరెక్టర్ జోగిందర్ సింగే చెప్పారు. అంటే కాంగ్రెస్ చేతిలో సీబీఐ ఆయుధంలో మారిందన్నది రుజువవుతోంది.  జగనన్న జైలులో ఎందుకున్నారో గులాంనబీ ఆజాద్ గారే స్వయంగా చెప్పారు. కాంగ్రెస్ లో ఉండి ఉంటే జగనన్న ముఖ్యమంత్రయి ఉండేవారని ఆయన చెప్పడం దీనికి ఉదాహరణ. ఆ పార్టీలో లేని కారణంగానే సీబీఐ కేసులు పెట్టి, ఆయనను తొక్కేయ్యాలనే దీక్షతో జైలులో పెట్టారు. కాంగ్రెస్ పార్టీతో బాగుండే వారిపై సీబీఐని ప్రయోగించరు.  చిరంజీవి బంధువు ఇంట్లో రూ. 70 కోట్లు దొరికితే చర్యలు లేవు. పీసీసీ అధ్యక్షుడు బొత్స మాఫియా డాన్ అని కాంగ్రెస్ నాయకుడే ఆరోపించినప్పటికీ దానిమీద సీబీఐ విచారణ చేయించరు. చంద్రబాబు మీద ఎన్ని అవినీతి ఆరోపణులున్నా... ఆయన ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టరు కనుక సీబీఐ విచారణ ఉండదు. దేవుడనే వాడున్నాడు.. ఉదయించే సూర్యుణ్ణి ఎవరూ ఆపలేరు. జగనన్నను కూడా ఎవరూ ఆపలేరు. జగనన్న కూడా ఎవరూ ఆపలేరు.'

     రాష్ట్రంలోనే నల్లగొండ జిల్లాలో బత్తాయి ఎక్కువ పండుతుందనీ, కానీ ఇక్కడే బత్తాయి రైతుకు నష్టాలు ఎదురవుతున్నారనీ శ్రీమతి షర్మిల చెప్పారు. బత్తాయి రైతును ఆదుకునే వారే లేకపోయారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం వారి గురించి పట్టించుకోవడం లేదన్నారు. మహానేత జీవించి ఉన్నపుడు బత్తాయి మార్కెట్ కోసం 40 ఎకరాలను కేటాయించారని ఆమె తెలిపారు. దీనిని ప్రభుత్వం విస్మరించిందని శ్రీమతి షర్మిల ఆరోపించారు.

Back to Top