మతం మాటున నీచ రాజకీయాలు

హైదరాబాద్, 21 అక్టోబర్ 2012 : షర్మిల పాదయాత్రతో కాంగ్రెస్, టిడిపిలు బెంబేలెత్తుతున్నాయని  వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి శోభా నాగిరెడ్డి ఎద్దేవా చేశారు.
"షర్మిల పాదయాత్రకు వచ్చిన స్పందన చూడండి. ఢిల్లీ నుండి నామా నాగేశ్వర రావు నుండి చంద్రబాబు దాకా అంతా షర్మిల యాత్ర పైనే మాట్లాడుతున్నారు" అని ఆమె వ్యాఖ్యానించారు. వైయస్‌ఆర్‌సీపీని ఎదుర్కోలేక కులాన్నీ మతాన్నీ అడ్డం పెట్టుకుని నీచ రాజకీయాలు చేస్తున్నారని ఆమె విమర్శించారు. కొండయ్య కమిషన్‌ను చంద్రబాబు అమలు పరిస్తే, రాజశేఖర్ రెడ్డి పూజారులకు వేతనాలు వచ్చేలా చేశారని ఆమె గుర్తు చేశారు. ఒక్క పూజారినైనా చెప్పమనండి, చంద్రబాబు హయాంలో మేలు జరిగిందని! అని ఆమె ప్రశ్నించారు. అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు కుమ్మక్కయ్యాయని ఆమె ఆరోపించారు. 

Back to Top