మాటలు తప్ప అభివృద్ధి చేతగాదు..

చంద్రబాబుపై వైయస్‌ఆర్‌సీపీ నేత ఈశ్వరరావు ఆగ్రహం
విజయనగరంః మాటలు తప్ప అభివృద్ధి చేతకాని అసమర్థ సీఎం చంద్రబాబు అని వైయస్‌ఆర్‌సీపీ నేత జరజాపు ఈశ్వరరావు ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో సాలూరు నియోజకవర్గానికి ఎన్నో హామీలిచ్చి విస్మరించారని విమర్శించారు. సింగపూర్,మాలేషియా అంటూ దేశాలు తిరగడమే కాని ప్రజలకు కనీస సదుపాయాలు కల్పించడంలో చంద్రబాబు విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాలూరులో  గిరిజన యూనివర్శిటీ ఏర్పాటు చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారని ఇప్పటి వరుకు పునాది çకూడా పడలేదన్నారు.  బైపాస్‌ రోడ్డు  హామీని కూడా విస్మరించారన్నారు. గత కొన్నేళ్లుగా పేద ప్రజలు గృహాలు లేక  ఇబ్బందులు పడుతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో  ధనికులకే లబ్ధిచేకూరుస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ పాలనలో  ఒక హౌసింగ్‌ లోన్‌ కూడా ఇవ్వలేదన్నారు. గతంలో దివంగత  మహానేత వైయస్‌ఆర్‌ హయాంలో నియోజకవర్గంలో 50 వేల ఇళ్లు కేటాయించారని గుర్తుచేశారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత  ఒక గృహం  కూడా మంజూరు చేయలేదన్నారు.
Back to Top