మంగళవారం షర్మిల పాదయాత్ర 15.1 కి.మీ.లు

అనంతపురం, 23 అక్టోబర్ 2012 :  షర్మిల 'మరో ప్రజాప్రస్థానం' పాదయాత్ర మంగళవారం అనంతపురం జిల్లాలోకి ప్రవేశిస్తుంది. ప్రస్తుతం వైయస్ఆర్‌ జిల్లాలో పాదయాత్ర కొనసాగిస్తున్న షర్మిల సోమవారం రాత్రి నేర్జాంపల్లి శివారులో బస చేశారు. మంగళవారం నేర్జాంపల్లి గ్రామం దాటాక మళ్లీ వైఎస్సార్ జిల్లాలోనే మరో 5 కిలోమీటర్ల మేర పాదయాత్ర ఉంటుంది. పార్నపల్లిలో ప్రజలను కలిశాక ఆమె చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ను సందర్శిస్తారు.
మధ్యాహ్న భోజనం అనంతరం ఒంటి గంటకు అనంతపురం జిల్లా దాడితోటకు చేరుకుంటారు. ఆ గ్రామ శివారులోనే ఆమె రాత్రికి బసచేస్తారు. మంగళవారం పాదయాత్రలో వైఎస్ షర్మిల 15.1 కిలోమీటర్లు నడవనున్నట్లు వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ ప్రోగ్రాం కో ఆర్డినేటర్ తలశిల రఘురాం,  జిల్లా కన్వీనర్ శంకరనారాయణ మీడియాకు తెలిపారు.

Back to Top