'మండే సూర్యుడు’ పాటల సీడీ ఆవిష్కరణ

ఇబ్రహీంపట్నం:

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం శేరిగూడ గ్రామానికి చెందిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  నాయకుడు జి. శ్రీనివాస్‌రెడ్డి ‘మండే సూర్యుడు’ పేరిట శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డిపై పాటల సీడీని రూపొందించారు.  పార్టీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి ఈ సీడీని శుక్రమవారం ఆవిష్కరించారు. సీడీని రూపొందించిన శ్రీనివాస్‌రెడ్డిని అభినందించారు. గేయ రచయిత సవ్యసాచి. రాగమయి రమేశ్ ఆ గీతాలను ఆలపించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు జి.సుధాకర్‌రెడ్డి, జి. నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తాజా ఫోటోలు

Back to Top