హోంగార్డులను పర్మినెంట్‌ చేయాలి

ఏపీ అసెంబ్లీ: హోంగార్డులను పర్మినెంట్‌ చేయాలని వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. సోమవారం జీరో అవర్‌లో ఆయన ఉద్యోగుల సమస్యలపై ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగులకు కరువు భత్యం వారి హక్కు అన్నారు. పీఆర్‌సీ బకాయిలు, మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ కింద పూర్తిగా డబ్బులు చెల్లించాలని కోరారు. గతంలో రూ.50 వేల లోపు మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ ఇచ్చేవారు దీన్ని వెంటనే అమలు చేయాలన్నారు. ఫెస్టివల్‌ అడ్వాన్స్‌ ఇవ్వాలని సూచించారు. రాష్ట్రంలో  హోంగార్డుల పరిస్థితి దారుణంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. చట్టం 1948లో సవరణ చేసి ముఖ్యమంత్రి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం హోంగార్డులను రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగులకు రిటైర్డ్‌మెంట్‌ రోజు ఇళ్ల స్థలాలు ఇచ్చి వారిని సాగనంపాలని కోరారు. కారుణ్య నియామకాలు చేపట్టడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో. ఉద్యోగుల సంఘాల నాయకుల్లో తీవ్ర అసంతృప్తి ఉందన్నారు. కారుణ్య నియామకాల విషయంలో ఐదు రకాల జబ్బులే కాకుండా ఉద్యోగుల సంఘాలతో చర్చించి వారికి మేలు చేయాలని కోరారు.

Back to Top