మైనార్టీ విభాగం ఛలో ఇడుపులపాయ

హైదరాబాద్, 3 అక్టోబర్ 2012: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు వైయస్‌ జగన్మోహన్‌రెడ్డికి మంచి జరగాలని ఆకాంక్షిస్తూ బుధవారంనాడు ఛలో ఇడుపులపాయ యాత్ర నిర్వహిస్తున్నట్లు పార్టీ మైనార్టీ విభాగం నాయకుడు హెచ్‌.ఎ. రెహ్మాన్‌ తెలిపారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మైనార్టీ విభాగం ఆధ్వర్యంలో ఈ యాత్ర నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలు నుంచి ఇడుపులపాయ వరకూ ఈ యాత్ర కొనసాగుతుందని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచీ మైనార్టీలు ఛలో ఇడుపులపాయ కార్యక్రమంలో పాల్గొంటారని రెహ్మాన్‌ వివరించారు. జగన్మోహన్‌రెడ్డి నిర్దోషి అని త్వరలోనే తేలుతుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. బుధవారం మధ్యాహ్నం చంచల్‌గూడ నుంచి మైనార్టీ నాయకులు ఇడుపులపాయకు బయలుదేరి వెళ్ళారు.

Back to Top