మహానేత వైయస్‌ఆర్‌కు విజయమ్మ నివాళి

హైదరాబాద్, 13 మార్చి 2013: మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డికి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ బుధవారం ఉదయం నివాళులు అర్పించారు. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలకు హాజరయ్యే ముందు శ్రీమతి విజయమ్మ, పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి పంజాగుట్టలో ఉన్న మహానేత వైయస్‌ఆర్‌ విగ్రహం వద్దకు వెళ్ళారు. రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఆమె నివాళులు అర్పించారు. అనంతరం అక్కడి నుంచి వారంతా కలిసి బడ్జెట్‌ సమావేశాల్లో పాల్గొనేందుకు అసెంబ్లీకి వెళ్ళారు. కాగా, శ్రీమతి విజయమ్మ రాకతో పంజాగుట్ట సర్కిల్‌ జగన్నినాదాలతో హోరెత్తింది.
Back to Top