జీవితాంతం వైయ‌స్ఆర్‌సీపీలోనే ఉంటాం

అనంత‌పురం:  పింఛన్లు ఇస్తామని పిలిచి టీడీపీ కండువాలు వేయడం సరికాదు.. పింఛన్లు, ఇళ్ల పేరుతో కండువాలు కప్పడం ఒక్క ధర్మవరం ఎమ్మెల్యేకే చెల్లులుందని, చిత్తశుద్ధి ఉంటే అర్హులందరికీ పింఛన్లు మంజూరు చేయాలని వైయ‌స్ఆర్‌సీపీ  విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగారెడ్డి, ఎస్‌కే యూనివర్శిటీ నాయకులు జయచంద్రారెడ్డి, ఓబిరెడ్డి,  జిల్లా సహాయ కార్యదర్శి సుబహాన్‌బాషా అన్నారు. గురువారం పట్టణంలోని కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి నివాసంలో వారు విలేకరులతో మాట్లాడారు.  రావులచెరువులో పింఛన్లు ఇస్తామని మా నాన్న తిప్పారెడ్డిని టీడీపీ నాయకులు పిలిచి ఎమ్మెల్యే సూర్యనారాయణ సమక్షంలో కండువాలు వేసి, టీడీపీలో చేరినట్లు ప్రచారం చేశారన్నారు.  ఇవన్నీ అవాస్తవమన్నారు. పింఛను ఆశచూపి అక్కడికి వెళ్లాక ఉన్నట్టుండి కండువాలు కప్పడం ఎమ్మెల్యే నీచ రాజకీయానికి నిదర్శనమన్నారు. పింఛన్లు, ఇళ్లు ఆశచూపి పార్టీలో చేరినట్లు ప్రకటనలు చేయడంకాదు నీకు దమ్ము ఉంటే మీ సీఎం చంద్రబాబునాయుడు నిరుద్యోగ భృతి ఇస్తామని మూడేళ్లు దాటినా ఇవ్వలేదని నీకు చేతనైతే నిరుద్యోగ భృతి ఇప్పించాలని సవాల్‌ విసిరారు. ఒక్కో నిరుద్యోగికి రూ.72 వేలు బకాయి ఉన్నాడని చెప్పారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పిన బాబు ఇంతవరకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదన్నారు. మీ నాయకుడు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఇలా పింఛన్లు ఇస్తామంటూ కండువాలు వేయడం మానుకోవాలని హితవు పలికారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ నాయకులు తిప్పారెడ్డి, వెంకటనారాయణరెడ్డి, నారాయణరెడ్డి, కమలాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Back to Top