ప్ర‌ధానికార్యాల‌యంనుంచి జ‌గ‌న్ కు లేఖ‌

హైద‌రాబాద్) ప్ర‌త్యేక హోదా మీద అలుపెర‌గ‌ని పోరాటం చేస్తున్న ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ కు కేంద్ర ప్ర‌భుత్వం లేఖ రాసింది. గతంలో ప్ర‌త్యేక హోదా కోసం ప్ర‌ధాన‌మంత్రికి వైఎస్ జ‌గ‌న్ రాసిన లేఖ‌కు ప్ర‌త్యుత్త‌రం ఇచ్చింది. ప్ర‌త్యేక హోదా పొందేందుకు కావ‌ల‌సిన అర్హ‌త‌లు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు  లేవ‌ని తేల్చి చెప్పింది. ఈ మేర‌కు ప్ర‌ధాన‌మంత్రి కార్యాల‌యం త‌ర‌పున కేంద్ర వాణిజ్య శాఖ నుంచి ఆ శాఖ ఉప కార్య‌ద‌ర్శి ఆశిష్ ద‌త్తా ఈ లేఖ రాశారు. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అబివృద్ది చేసుకోవాల‌ని సూచించారు. విభ‌జ‌న చ‌ట్టంలోని అన్ని హామీలు అమ‌లు చేస్తున్న‌ట్లు ఈ లేఖ లో స్ప‌ష్టం చేశారు. అన్ని రాష్ట్రాల‌తో స‌మానంగానే రాష్ట్రానికి న్యాయం చేస్తున్నామ‌ని వివ‌రించారు. ఇవ్వాల్సిన ప్రోత్సాహ‌కాలు ఇప్ప‌టికే ఇచ్చినందున కొత్త‌గా ప్రోత్సాహ‌కాలు ఏమీ ఇవ్వ‌లేమ‌ని తేల్చి చెప్పారు. 

Back to Top