ఆట మొదలైంది... వైయస్సార్సీపీ జెండా ఎగరవేద్దాం

ఆలస్యం అయ్యింది..అంతం వరకు ఉంటా
కాసు మహేష్‌రెడ్డి
నరసరావుపేట: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు ఆలస్యమైంది..అయితే అంతం వరకు ఇక్కడే ఉంటానని కాసు మహేష్‌రెడ్డి అన్నారు. వైయస్ జగన్ సమక్షంలో వైయస్సార్సీపీలో చేరారు. ఈసందర్భంగా మాట్లాడుతూ...ఈ రాష్ట్రంలో ప్రస్తుతం నడుస్తున్న పరిస్థితులు అందరికీ తెలుసు అన్నారు. రెండేళ్లుగా నాగార్జున సాగర్‌ కాల్వల్లో నీరు పారడం లేదు. దుర్మార్గం ఏరులై పారుతోందని ధ్వజమెత్తారు. పెద్ద మనసు చేయండి..చేయి చేయి కలుద్దాం..వైయస్‌ జగన్‌ను సీఎం చేసి రాష్ట్రానికి పట్టిన శనిని విడిపించుకుందాం. 80 సంవత్సరాల క్రితం ఒక మారుమూల గ్రామంలో సామన్య కుటుంబంలో పుట్టిన కాసు బ్రహ్మానందరెడ్డి అంచెలంచెలుగా ఎదిగారంటే అది మీ అభిమానమే. మీరుణం తీర్చుకునేందుకు వైయస్‌ఆర్‌సీపీలో చేరాను. నాగార్జున సాగర్‌ను కట్టి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేశారు. మళ్లీ ప్రజల ప్రభుత్వం రావాలంటే అది వైయస్‌ జగన్‌తోనే సాధ్యమవుతుంది. 2014లో వైయస్‌ఆర్‌సీపీ ఒక్క శాతం ఓటుతో ఓటమి చవిచూడవచ్చు. అయితే వెనుకడుగు వేసే నేత కాదు మన జగనన్న. ప్రతి ఒక్కరం గడప గడపకూ వెళ్దాం. ప్రతి గుండె చప్పుడులో వైయస్‌ఆర్‌సీపీని వినిపిద్దాం. గత ఆదివారం వైయస్‌ జగన్‌ను కలిశాను. మహేష్‌ పార్టీలోకి రా. అన్నదమ్ముల్లా పయనిద్దాం అన్నారు. ఆ ఒక్క మాట చాలన్న..నేను చేరడానికి ఒక్క కండీషన్‌ ఉందని చెప్పాను. తరతరాలుగా మా వెంట ఉన్న ప్రజల సమక్షంలో చేరాలని కోరాను. అందుకే అన్న సమక్షంలో వైయస్‌ఆర్‌సీపీలో చేరాను. రాజన్న రాజ్యాన్ని సాధించుకుందాం. వైయస్‌ జగనన్నను సీఎం చేసుకుందాం.
...........................................................................
మాట తప్పని మడమ తిప్పని నేత వైయస్ జగన్
 ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి
నరసరావుపేట:  పల్నాటి ముఖద్వారమైన నరసరావుపేట నియోజకవర్గంలో వైయస్‌ఆర్‌సీపీ జెండా ఎగురవేద్దాం. కోడేల ఆయన కుమారుడికి బుద్ధి చెబుదాం. కొటప్పకొండ తిరునాలకు ఎలా వస్తారో..ఈ రోజు అలాగే జనం వచ్చారు. కాసు మహేష్‌ రెడ్డి వైయస్‌ఆర్‌సీపీలో చేరటం మంచి శుభపరిణామం. పల్నాడు ప్రాంతంలో పార్టీ బలోపేతానికి ఇది మంచి అవకాశం. రాష్ట్రంలో ప్రజలు ఎవరూ కూడా సంతోషంగా లేరు. బాబు  అన్యాయంగా, అక్రమంగా కేసులు పెట్టడం, పార్టీ ఫిరాయింపులకు పాల్పడటం దుర్మార్గం, బాబు పాలనలో రైతులు, విద్యార్థులు, వ్యాపారులు ఎవరూ సంతోషంగా లేరు. వైయస్‌ఆర్‌ హయాంలో అందరూ సంతోషంగా గడిపారు. చంద్రబాబు ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు ఇచ్చారు. ఈ రోజు ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. నోట్ల మార్పిడి విషయంలో ఈ ప్రభుత్వాలు ఎంత పెద్ద తప్పు చేశారో ప్రజలు తెలుసుకున్నారు. నరసరావుపేట నియోజకవర్గంలో కోడేల, ఆయన కుమారుడు చేస్తున్న అవినీతి అంతా ఇంతా కాదు. రేషన్‌ బియ్యం నుంచి చెరువులో మట్టి అమ్ముకుంటున్నారు. నోట్ల మార్పిడి విషయంలో కూడా కోడెలా శిమరామకృష్ణ కమీషన్లు తీసుకున్నారు. మాట తప్పని, మడమ తిప్పని నేత ఎవరైనా ఉన్నారంటే వైయస్‌ జగన్‌ ఒక్కరే. చిన్న చిన్న సమస్యలు ఉన్నా అందరం కూర్చొని పరిష్కరించుకుందాం.

Back to Top