బాబువి వెన్నుపోటు రాజకీయాలు

కర్నూలు: వైయస్సార్సీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతి చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజల సొమ్ముతో చంద్రబాబు జల్సాలు చేస్తున్నారని,  స్వప్రయోజనాల కోసం  రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారని మండిపడ్డారు.  చంద్రబాబుకు వెన్నుపోటు రాజకీయాలు తప్ప డైరెక్ట్ పాలిటిక్స్ చేతకావన్నారు.  ఒక్క ప్రాజెక్టు కూడా కట్టని ఘన చరిత్ర చంద్రబాబుదని  లక్ష్మీపార్వతి విమర్శించారు. వైయస్ జగన్ దీక్షా స్థలి వద్ద ఆమె మాట్లాడారు. 

20 ఏళ్లుగా చంద్రబాబు ప్రజలను మోసగిస్తూనే ఉన్నారని లక్ష్మీ పార్వతి నిప్పులు చెరిగారు.  అవినీతికి పెద్దపీట వేయడంలో చంద్రబాబు ముందుంటారని దుయ్యబట్టారు. కోట్లాది రూపాయలు ఎరగా చూపి బాబు ఎమ్మెల్యేలను కొంటున్నారని, గెలిచిన పార్టీకి వెన్నుపోటు పొడిచి ఫిరాయింపుదారులు మరో వెన్నుపోటుదారుడి వద్దకు వెళుతున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు  చీకట్లో చిదంబరం కాళ్ల మీద పడి వైఎస్  జగన్ పై అక్రమంగా కేసులు బనాయించారని లక్ష్మీపార్వతి ఫైరయ్యారు. 

ఎల్లప్పుడు ప్రజల మేలు కోసం ఆలోచించే నాయకుడు వైయస్ జగన్ అని, ప్రజా సంక్షేమం కోసం ఆయన ఎన్నో దీక్షలు చేశారని గుర్తు చేశారు. జననేత ప్రజలతోనే ఉన్నారని, ప్రజలకు ఎప్పుడు దూరంగా లేరని చెప్పారు. అవినీతి సొమ్ముతో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను ఎలా కొనాలా అని బాబు, నారా లోకేశ్ లు ఆలోచిస్తున్నారని లక్ష్మీపార్వతి ఆగ్రహించారు. 

To read this article in English:  http://bit.ly/1rQJIvI 

Back to Top