పచ్చపాలనలో మహిళల బతుకులు దుర్భరం

కాల్ మనీ సెక్స్ రాకెట్ కేసు నీరుగార్చేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నారు. విజయవాడ సీపీ కార్యాలయానికి బాధితులు వెల్లువలా తరలివచ్చి టీడీపీ నేతలపై ఫిర్యాదు చేస్తున్నారు. అయినా ప్రభుత్వ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. టీడీపీ నేతలను సెక్స్ రాకెట్ కేసు నుంచి తప్పించడం కోసం అసెంబ్లీ సమావేశాలను సజావుగా సాగనీయని చంద్రబాబు....ఇప్పుడు ఈవ్యవహారం మొత్తాన్ని మరుగునపడేస్తున్నారు. బడాబాబులను వదిలి చిన్నచేపలను కేసులో ఇరికించి చేతులు దులుపుకోవాలని చూస్తున్నారు. 

అసెంబ్లీలో ప్రధాన అంశంగా వైఎస్సార్సీపీ కాల్ మనీ సెక్స్ రాకెట్ పై చర్చకు పట్టుబడితే... బండారం బయటపడుతుందని భయపడిపోయిన చంద్రబాబు టాపిక్ డైవర్ట్ చేసేందుకు ప్రతిపక్ష సభ్యులపై ఎదురుదాడికి దిగారు. చర్చ జరగకుండా అడ్డుపడ్డాడు. మహిళల మాన ప్రాణాలతో ఆడుకోవడమే గాకుండా వారి ఆస్తులు దోచుకొని పచ్చని కుటుంబాల్లో చిచ్చుపెట్టిన దోషులను ముఖ్యమంత్రి రక్షిస్తున్నారంటే ఇంతకంటే సిగ్గుమాలిన పని మరొకటి లేదని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈకేసులో ఉన్న టీడీపీ నేతలను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 
Back to Top