16న కొవ్వూరులో ప్లీనరీ

నెల్లూరు: ఈ నెల 16వ తేదీన కొవ్వూరులోని రుక్మిణి కల్యాణ మండపంలో వైయస్‌ఆర్‌ సీపీ ప్లీనరీ సమావేశం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిలు హాజరువుతారని పలువురు నేతలు తెలియజేశారు. ప్లీనరీ సమావేశంలో పార్టీ బలోపేతంపై నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్ధేశం చేయనున్నట్లు చెప్పారు. నియోజకవర్గ పరిధిలోని నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

Back to Top