రాష్ట్రంలో దుస్థితికి కాంగ్రెస్, టిడిపిలే కారణం

గుంటూరు :

రాష్ట్రంలో అగ్ని ప్రజ్వరిల్లడానికి కాంగ్రెస్, దాని తోక పార్టీ టిడిపియే కారణమని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఆరోపించారు. జననేత శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డిని రాష్ట్ర రాజకీయాల్లో లేకుండా చేయటానికి రెండు పార్టీలు కంకణం కట్టుకున్నాయని ఆయన ధ్వజమెత్తారు. ఆత్మగౌరవ యాత్ర పేరుతో చంద్రబాబు నాయుడు ప్రజల ముందుకు వస్తే అంతిమయాత్ర చేసి హైదరాబాదు పంపాలని నాని పిలుపునిచ్చారు. సీమాంధ్ర టిడిపి నాయకులకు సిగ్గు ఎగ్గు ఉంటే 2008లో ప్రణబ్ ముఖర్జీకి‌ టిడిపి ఇచ్చిన లేఖను వెనక్కు తీసుకునే వరకు చంద్రబాబు ఇంటి వద్ద ధర్నా చేయాలని‌ ఆయన డిమాండ్ చేశారు.

కిరణ్, బాబులను ప్రజలు క్షమించరు: రాధా
టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిలను ప్రజలు ఎట్టిపరిస్థితుల్లోనూ క్షమించబోరని మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ స్పష్టం చేశారు. చంద్రబాబుకు దమ్ము, దైర్యం ఉంటే కాంగ్రెస్ పార్టీ వెనకాల తిరగటం మానాలని సూచించారు. తెలంగాణకు అనుకూలంగా 2008లో లేఖ ఇచ్చి నేడు సీమాంధ్రకు ఐదు లక్షల ప్యాకేజీ ఇవ్వాలని‌ చంద్రబాబు కోరటం సిగ్గుచేటు అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చరిత్ర హీనుడిగా మిగిలిపోవడం ఖాయమని రాధా అన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top