పంచభూతాలను పంచుకు తింటున్నారు

 

అనంతపురం:  టీడీపీ ప్రభుత్వం అవినీతిమయమైందని, పంచభూతాలను పంచుకు తింటున్నారని వైయస్‌ఆర్‌సీపీ ధర్మవరం నియోజకవర్గ సమన్వయకర్త కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి విమర్శించారు. వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఉట్లూరు గ్రామంలో 500 కిలోమీటర్ల మైలు రాయిని దాటిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో టీడీపీ నేతలు విఫరీతంగా ప్రజలను దోచుకుతింటున్నారని ఫైర్‌ అయ్యారు. ప్రజలు ఎక్కడా కూడా సంతోషంగా లేరని, గ్రామాల్లో  ఉపాధి పనులు జరగడం లేదన్నారు.  పేదవారు, వికలాంగులు అని చూడకుండా వైయస్‌ఆర్‌సీపీ సానుభూతి పరులు అంటూ సంక్షేమ పథకాలు ఇవ్వడం అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. చివరకు ఇడ్లీ అమ్ముకునే వారిని కూడా వదలడం లేదని విమర్శించారు. నాడు బాబు వస్తే జాబు వస్తుందని ప్రచారం చేసిన నేతలు నాలుగేళ్లలో ఏ ఒక్కరికి ఉద్యోగం ఇవ్వలేదన్నారు. సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందడం లేదని తెలిపారు. వైయస్‌ జగన్‌ పాదయాత్రలో అడుగడుగునా సమస్యలు వెలుగు చూస్తున్నాయని, జననేత ముఖ్యమంత్రి కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారని తెలిపారు.  భవిష్యత్‌ వైయస్‌ఆర్‌సీపీదే అని, వైయస్‌ జగన్‌తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని కేతిరెడ్డి పేర్కొన్నారు.
 
Back to Top