కర్నూలు సభకు ‘తూర్పు’ నేతలు

కాకినాడ:

కర్నూలు జిల్లాలో వైయస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్‌ రెడ్డి సోదరి షర్మిల పాదయాత్ర ముగింపు సభలో పాల్గొనేందుకు తూర్పుగోదావరి జిల్లా నుంచి పెద్దఎత్తున పార్టీ శ్రేణులు తరలి వెళ్లనున్నారు. రాజమండ్రి, కాకినాడ, అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గాల నేతలు బయలుదేరుతున్నారు. వైయస్ఆర్  కాంగ్రెస్ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి అధ్యక్షతన కాకినాడలోని పార్టీ కార్యాలయంలో సీజీసీ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్ తదితరులు దీనిపై సమావేశమై సమీక్షించారు. నియోజకవర్గాల వారీగా ఏ ప్రాంతాల నుంచి ఎంత మంది నేతలు వెళతారనే విషయాన్ని తెలుసుకున్నారు. కోనసీమ నుంచి వచ్చే మరికొన్ని వాహనాలు రావులపాలెం వద్ద కలుస్తాయన్నారు. ఈ సందర్భంగాబోస్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి కర్నూలు సభకు తరలి వెళ్లేందుకు నేతలు ఉత్సాహం చూపుతున్నారన్నారు. పార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి మాట్లాడుతూ షర్మిల మరో ప్రజాప్రస్థాన యాత్రకు అనూహ్య స్పందన లభిస్తోందన్నారు.

Back to Top