కర్నూలులో షర్మిల యాత్రపై చర్చ

కర్నూలు:

రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ముగింపు పలుకుదామని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. కర్నూలు భాగ్యనగర్‌లో ఏర్పాటు చేసిన పార్టీ కర్నూలు నియోజకవర్గ కార్యాలయాన్ని ఆ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు వై.వి.సుబ్బారెడ్డి గురువారం ప్రారంభించారు. అనంతరం బీఏఎస్ కల్యాణ మంటపంలో నగర కన్వీనర్ ఎ. బాలరాజు అధ్యక్షతన కర్నూలు నియోజకవర్గ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గౌరు వెంకటరెడ్డి మాట్లాడుతూ ప్రజల కష్టాలు పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు కార్యకర్తలు విశ్రమించరాదని పేర్కొన్నారు.  వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి చెల్లెలు షర్మిల పాదయాత్రను కర్నూలు నియోజకవర్గంలో విజయవంతం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని గుర్తు చేశారు.  పార్టీ కర్నూలు నియోజకవర్గ ఇన్‌చార్జి ఎస్వీ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 21న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర కర్నూలుకు చేరుకుంటుందని తెలిపారు.   మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాష్‌రెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా నాయకుడు నిడ్జూరు రాంభూపాల్‌రెడ్డి, మహిళా విభాగం జిల్లా కన్వీనర్ నారాయణమ్మ, సి.అరుణకుమారి, మైనార్టీ సెల్ జిల్లా కన్వీనర్ హఫీజ్‌ఖాన్, వైఎస్‌ఆర్ ట్రేడ్ యూనియన్ జిల్లా కన్వీనర్ అజయ్, జిల్లా కమిటీ సభ్యుడు జయంతి వెంకటేశ్వర్లు, తోట వెంకటక్రిష్ణారెడ్డి మాట్లాడారు. అనంత రం షర్మిల పాదయాత్రకు చేపట్టాల్సిన ఏర్పాట్లపై వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో చర్చించి పోస్టర్లను విడుదల చేశారు.

Back to Top