కర్నూలు దాటనున్న షర్మిల యాత్ర

హైదరాబాద్:

మహానేత తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన వైయస్ షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ఈ నెల 22న అంటే గురువారం  మహబూబ్‌నగర్ జిల్లాలోకి ప్రవేశిస్తుంది. మధ్యాహ్నం 1 గంటకు తుంగభద్ర  వంతెన వద్ద షర్మిల మహబూబ్‌నగర్‌లో అడుగుపెడతారని పార్టీ  జిల్లా కన్వీనర్ ఎడ్మ కృష్ణారెడ్డి, సీజీసీ సభ్యుడు కె.కె.మహేందర్‌రెడ్డి, పాదయాత్ర సమన్వయ కమిటీ సభ్యుడు తలశిల రఘురామ్ తెలిపారు. జిల్లా ప్రజలు షర్మిలకు ఘనస్వాగతం పలకడానికి సంసిద్ధులవుతున్నారని చెప్పారు. మహబూబ్ నగర్ జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 225 కిలోమీటర్ల మేర షర్మిల పాదయాత్ర కొనసాగుతుందని వివరించారు.

Back to Top