హైదరాబాద్: మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం మృతి పట్ల వైఎస్సార్ సీపీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ఆయన సేవల్ని గుర్తు చేసుకొన్నది. <br/>పార్టీ కేంద్ర కార్యాలయం హైదరాబాద్‌లోని లోటస్ పాండ్ లో సంతాప కార్యక్రమం ఏర్పాటైంది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్, ప్రధాన కార్యదర్శి విజయ సాయిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమానికి హాజరు అయ్యారు. దేశానికి అబ్దుల్ కలాం చేసిన సేవల్ని స్మరించుకొన్నారు. రాష్ట్రంలోని వివిధ నగరాల్లో కలాం సంస్మరణ కార్యక్రమాలు నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.