బాబు ఫాసిస్ట్ పాలన

హైదరాబాద్ః చంద్రబాబు ఫాసిస్ట్ పాలన కొనసాగిస్తున్నారని వైయస్సార్సీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కన్నబాబు మండిపడ్డారు. కాపులకు ఐదేళ్లలో ఐదు వేల కోట్లు కేటాయించడంతో పాటు బీసీల్లో చేరుస్తామని చెప్పిన చంద్రబాబు...ఇవాళ చేస్తున్నదేంటని ప్రశ్నించారు. ముద్రగడ పద్మనాభం పట్ల ప్రభుత్వ వ్యవహార శైలి దారుణంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేక వాటి అమలు కోసం పోరాడుతున్న వారిని అణిచివేయడం దారుణమన్నారు.  

ఆనాడు తుని ఘటన వెనుక రాయలసీమ వాళ్లున్నారని మాట్లాడారు. ఇవాళ గోదావరి జిల్లా వాసులను అరెస్ట్ చేస్తున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఇష్టానుసారం మాట్లాడడం తగదని అధికార టీడీపీని హెచ్చరించారు. ముద్రగడ ఆరోగ్యం క్షీణించకముందే సమస్యను పరిష్కరించాలని,  తక్షణమే మీడియాపై నియంత్రణ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. 
Back to Top