కమ్మూరుక్రాస్‌ నుండి మొదలైన షర్మిల పాదయాత్ర

అనంతపురం, 31 అక్టోబర్‌ 2012: 
మహానేత తనయ, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర బుధవారం ఉదయం జిల్లాలోని కమ్మూరుక్రాస్‌ నుంచి ప్రారంభమైంది. అభిమానులు, పార్టీ శ్రేణుల కోలాహలం మధ్య ఆమె ప్రజాప్రస్థానం 14వ రోజు పాదయాత్రను ప్రారంభించారు. కమ్మూరు క్రాస్ నుంచి ‌పాదయాత్ర ప్రారంభించిన షర్మిల అరవకూరు, అరవకూరు శివారు మీదుగా కూడేరు చేరుకుంటారు. కూడేరు గ్రామ శివార్లలో ఈ రాత్రికి బసచేస్తారు.
షర్మిల పాదయాత్ర అరవకూరు చేరుకున్నప్పుడు ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. జై జగన్‌ నినాదాలతో హోరెత్తించారు. షర్మిలను చూసేందుకు ఊరు ఊరంగా తరలివచ్చారు. రైతులు, మహిళలు, కూలీలు తమ సమస్యలను షర్మిలకు చెప్పుకున్నారు. వారందరి సమస్యలనూ శ్రద్ధగా వింటూ షర్మిల ముందుకు కదిలారు. 14వ రోజైన బుధవారం షర్మిల 12 కిలో మీటర్ల మేర మరో ప్రజాప్రస్థానం నిర్వహిస్తారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top