కాంగ్రెస్‌తో ప్యాకేజీ కుదుర్చుకున్న బాబు

ఒంగోలు:

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టకుండా ఉండటానికి కాంగ్రెస్ పార్టీతో ప్యాకేజీ కుదుర్చుకున్నారని ఒంగోలు ఎమ్మెల్యే, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విప్ అయిన బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన ఆరోపణ చేశారు. ఓబుళాపురం గనులను ఎస్ఆర్ మినరల్సు సంస్థకు  కట్టబెట్టేలా కాంగ్రెస్ పార్టీతో తెలుగుదేశం పార్టీ ఒప్పందం కుదుర్చుకుందని చెప్పారు. ఆ దిశగా ఫైలు కూడా కదులుతోందని వివరించారు. దద్దమ్మ, పనికిమాలిన ప్రభుత్వమని విమర్శించిన చంద్రబాబు ఈ ప్యాకేజీ కారణంగానే రాష్ట్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టడంలేదని వివరించారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని పార్లమెంటులో పెట్టాలనే నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని కూడా పార్లమెంటులో నెలకొల్పాలని బాలినేని కోరారు.

తాజా వీడియోలు

Back to Top