కాంగ్రెస్, టీడీపీలను ప్రజలు పాతేస్తారు

తాడిపత్రి: ‘వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి వెంట ప్రజలున్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీలను గుంత తీసి పాతేయడం తథ్యమ’ని వైఎయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీఈసీ సభ్యుడు పైలా నర్సింహయ్య అన్నారు. శుక్రవారం ఆయన స్థానిక ఆస్పత్రి పాలెంలోని వైఎయస్ఆర్ సీపీ కార్యాలయంలో పార్టీ నియోజకవర్గ యువజన నాయకుడు వీఆర్ వెంకటేశ్వరరెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. జగన్‌కు బెయిల్ కోసం శుక్రవారం రాష్ట్ర ప్రజలంతా ఎదురు చూశారన్నారు. బెయిల్ రానంత మాత్రాన పార్టీ శ్రేణులు అధైర్యపడొద్దని సూచించా రు. వైయస్ విజయమ్మ నాయకత్వం లో పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పాటుపడాలని పిలుపునిచ్చారు. సోనియా, చంద్రబాబు కుట్ర పన్ని బెయిల్ రాకుండా చేశారని విమర్శించారు. కాంగ్రెస్, టీడీపీలకు ధైర్యముంటే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు. పార్టీ జిల్లా స్టీరింగ్ కమీటీ సభ్యులు పేరం అమరనాథరెడ్డి, నాగిరెడ్డి, రషీద్ మాట్లాడుతూ కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై జననేతపై కుట్రలు పన్నుతున్నాయని దుయ్యబట్టారు. సమావేశంలో పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు వేమనాథరెడ్డి, పోచంరెడ్డి మనోహర్‌రెడ్డి, పట్టణ యూత్ నాయకుడు కంచెం రామ్మోహన్‌రెడ్డి, తాడిపత్రి పట్టణ, పెద్దపప్పూరు మండల కన్వీనర్లు సలాం, రఘనాథరెడ్డి, సేవాదళ్ నాయకులు చంద్ర, లక్ష్మినారాయణ తదితరులు పాల్గొన్నారు.

Back to Top