ఉద్యమం పుట్టుకొస్తుందనే జిత్తులు

మోసపూరిత హామీలతో  అన్యాయం
చంద్రబాబుపై కాపుల ఆగ్రహం

తూర్పుగోదావరిః
ఎన్నికల్లో కాపులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా చంద్రబాబు మోసం
చేస్తున్నారని వైఎస్సార్సీపీ శాసనసభా ఉపపక్షనేత జ్యోతుల నెహ్రూ
ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన ఆరుమాసాల్లో కాపులను బీసీల్లో చేర్చడంతో
పాటు... రూ.5 వేల కోట్లతో ప్రత్యేక కార్పొరేషన్ పెట్టి నిధులు
కేటాయిస్తానని చంద్రబాబు చెప్పారని నెహ్రూ తెలిపారు. ఇచ్చిన హామీని 18
మాసాల దాకా లాక్కొచ్చాడు తప్పితే నెరవేర్చలేదని నెహ్రూ ఎద్దేవా చేశారు.
చంద్రబాబు వ్యవహార శైలి అనుమానాస్పదంగా మారిందన్నారు. కాపులను బీసీల్లో
చేర్చే విషయమై చట్టం చేస్తే వైఎస్సార్సీపీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని
నెహ్రూ తేల్చిచెప్పారు. 

కాపుల ఉద్యమం పుట్టుకొస్తుందనే చంద్రబాబు హడావిడిగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికో ఛైర్మన్ నియమించారని నెహ్రూ విమర్శించారు. 
రెండు
బడ్జెట్ లలో వంద కోట్లు కేటాయించడం హాస్యాస్పదమన్నారు. కాపుల ఉద్యమానికి
కారకుడైన చంద్రబాబు...ఇచ్చిన మాట ప్రకారం కాపులకు రూ.5 వేల కోట్లు
కేటాయించి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని సూచించారు. పని జరగకూడదు
ఇచ్చినట్లు గొప్పలు చెప్పుకోవాలన్నదే చంద్రబాబు తాపత్రయమని నెహ్రూ
ఎత్తిపొడిచారు. 

కాపులే తనను అధికారంలోకి
తెచ్చారన్న చంద్రబాబు..వాళ్లను దువ్వడం కోసం మరోసారి మోసపుచ్చే ప్రయత్నం
చేయడం దారుణమన్నారు.  రుణమాఫీ, ప్రత్యేకహోదా సహా హామీల్లో ఎక్కడ చంద్రబాబు
స్పష్టత ఇవ్వడం లేదని నెహ్రూ దుయ్యబట్టారు. మళ్లీ అధికారం ఇస్తే చేస్తానని
చెప్పుకోవడానికి చేసే తంతుగా కనిపిస్తుందని ధ్వజమెత్తారు. అందుకోసమే
చంద్రబాబు జిత్తులు, ఎత్తులు వేసే పరిస్థితి కనిపిస్తోంద్నారు. బీసీలకు
నష్టం జరగకుండా కాపులను బీసీల్లో చేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని,
కాపుల రిజర్వేషన్ సాధించేందుకు వైఎస్సార్సీపీ త్రికరణ శుద్ధితో ఉందని
నెహ్రూ స్పష్టం చేసారు.
Back to Top