సిగ్గుగా లేదా బాబు నీకు

  • అమరావతి నడిబొడ్డిన రాజకీయ వ్యభిచారం చేస్తున్నావ్
  • బాబు నీదుర్మార్గపు పాలనను ప్రజలంతా చూస్తున్నారు
  • లోకేష్ మంత్రి అయ్యాక అధికారికంగా దోపిడీకి బోణి కొట్టాడు
  •  లే అవుట్ క్రమబద్ధీకరణలో ముడుపులపై విచారణ చేపట్టాలి
  • వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి జోగిరమేష్ డిమాండ్
విజయవాడః సీఆర్డీఏ పరిధిలో లే అవుట్ ల క్రమబద్ధీకరణలో సీఎం చంద్రబాబు కుమారుడు లోకేష్ భారీగా ముడుపులు పుచ్చుకున్నారని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్ ఆరోపించారు. అంతకుముందు అనధికారికంగా దోచుకున్న లోకేష్, మంత్రి అయ్యాక అధికారికంగా బోణీ కొట్టారని ఎద్దేవా చేశారు.  దీనిపై విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీఆర్డీఏ పరిధిలో  500 మీటర్ల లోపుంటేనే లేఅవుట్ లకి పర్మిషన్ ఇవ్వాలని చెప్పి 2015 ఏఫ్రిల్ 5న బాబు సర్కార్ జీవో 44 తీసుకొచ్చి  రైతులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, వాటిమీద ఆధారపడి బతుకుతున్న వేలాది కుటుంబాలను అన్యాయంగా ముంచారని ధ్వజమెత్తారు. నిన్న సడన్ గా సీఆర్డీఏ సబ్ కమిటీ మీటింగ్ పెట్టి 500 మీటర్ల దూరాన్ని ఎత్తేస్తున్నామని చెప్పడంలో మతలబేంటని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆరోజు జీవో ఎందుకు తీసుకొచ్చారు. రెెండేళ్ల తర్వాత దాన్ని ఎందుకు క్యాన్సిల్ చేస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు.  విజయవాడలో పార్టీ కార్యాలయంలో జోగి రమేష్ మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే....

జీవో ఇచ్చిన మరుక్షణమే రైతులు బాధపడుతున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కుదేలయింది. దానిపై ఆధారపడిన వేలాది కుటుంబాలు నిరాశ్రులయ్యారని వైయస్సార్సీపీ తరపున ఆరోజు చెప్పాం. సీఆర్డీఏ కార్యాలయాన్ని ముట్టడించాం. జి. కొండూరు, మైలవరం లాంటి మండలాలు వ్యవసాయ జోన్ పరిధిలోకి తేవడంతో ఎత్తేయాలని రైతులు గగ్గోలు పెట్టారు. కానీ రెండేళ్ల కాలంలో పెను మార్పులు. రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఆత్మహత్యలు చేసుకున్న దాఖలాలున్నాయి. ప్రభుత్వం జీవో తెచ్చిన కారణంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితులున్నాయి. చాలా కుటుంబాలు వలసలు వెళ్లాయి. ఈరోజు మేం చేపట్టిన డిమాండ్ ను సరళీకృతం చేశారు. కానీ దీనిలో మతలబు ఉంది. దీన్ని క్రమబద్ధీకరించేముందు వీళ్ల బినామీలతో వేలాది ఎకరాలు అడ్వాన్స్ లు గా ఇచ్చి కొనుగోళ్లు చేశాక ఈ ప్రకటన చేశారు. రెండేళ్లుగా రైతులు గుర్తుకు రాలేదా బాబు..?. ఆ రోజున ఎందుకు జీవో ఇచ్చారు. ఈరోజు ఎందుకు రిలాక్స్ చేశారు.

సీఆర్డీఏ మీటింగ్ లో లోకేష్ మెంబర్ కాదు.  ఆయన ఐటీ, పంచాయతీ రాజ్ శాఖా మంత్రి. ఆయనకేం సంబంధం లేకుండా ఆ సబ్ కమిటీలో కూర్చొని దగ్గరుండి రిలాక్స్ చేయించాడంటే ఎంత పెద్ద ఎత్తున మూడుపులు అందాయో సమాధానం చెప్పాలి. మేం నెత్తినోరు మొత్తుకొని చెప్పాం. రైతుల పిల్లలు చదువుకుంటున్నారు, పెళ్లిల్లుంటాయి.  వాళ్ల ఇష్టమొచ్చినట్లు వాళ్లు అమ్ముకుంటారు అంటే వాళ్ల నెత్తిన బండవేసి వ్యవసాయ జోన్ పరిధిలో ఉందంటారు. వ్యవసాయ జోన్ లో ఎందుకు పెట్టారని మేం ప్రశ్నిస్తే అదేం లేదని నారాయణ చెప్పాడు. మళ్లీ వాళ్లే  సింగపూర్ వాళ్లు చెప్పారని పెట్టామంటారు. వాళ్లు చెప్పారని ఎత్తేస్తారట. అంటే మీకు లబ్ది జరిగితే, ముడుపులు ఇస్తే లే అవుట్ లకు పర్మిషన్ ఇస్తారా..?రియల్ ఎస్టేట్  వ్యాపారం పుంజుకుంటే రైతులు బాగుంటారు. రైతుల పొలాలకి ధరలొస్తాయి. రైతులు బాగుంటే రియల్ ఎస్టేట్ బాగుంటది. దానిపై ఆధారపడిన కుటుంబాలు బాగుంటాయి. అవన్నీ ఆలోచించకుండా బాబు రైతులపై బండ వేశాడు . లోకేష్ ను సూటిగా అడుగుతున్నాం. ఎంత పెద్ద మొత్తంలో ముడుపులు అందాయో చెప్పాలి. ఏమీ చెప్పకుండా రెండేళ్లపాటు 99మంది లే అవుట్ లు..సుమారు 1255 ఎకరాల లే అవుట్ లు సీఆర్డీఏ ఆఫీసులో పెట్టుకొని రైతులను నానా ఇబ్బందులు పెట్టారు. ముడుపులు తీసుకుంటేనే లే అవుట్ లకు పర్మిషన్ ఇస్తారా...? బినామీల ద్వారా మీరు  పొలాలు కొన్నారు. ప్రజలంతా గమనిస్తున్నారు. టీడీపీకి తగిన బుద్ధి చెబుతారని జోగి రమేష్ హెచ్చరించారు. 

చంద్రబాబు అసెంబ్లీలో రౌడీలాగ ప్రవర్తిస్తున్నాడు. ప్రతిపక్ష నేతను మాట్లాడనీయకుండా అధికారాన్ని అడ్డంపెట్టుకొని గొంతు నొక్కే కార్యక్రమం చేస్తున్నాడు. 21మందిని తీసుకెళ్లి ఏం సాధించావ్ బాబు. నలుగురిని మంత్రిని తీసుకొని నీ వేలితో నీకంటిని పొడుచుకున్నావ్. చంద్రబాబు కాపులు, బీసీల  గొంతు కొస్తున్నాడని మీ పార్టీ ఎమ్మెల్యేలే అంటున్నారు.  చంద్రబాబు ఆయారాం, గయారాం అని...ఆయన కాకపోతే ఇంకో పార్టీ పెట్టుకుంటామని మీ ఎమ్మెల్యేలే నిన్ను నిలదీశారు.  వైయస్సార్సీపీని  బలహీనం  చేయాలనుకొని నీవు, నీ పార్టీ బలహీనులయ్యారు. 21మంది పోయినా ప్రజలు మా వెంట ఉన్నారు. ప్రతీ మీటింగ్ లో రౌడీలు, గూండాలు అంటావు. ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలు అవేనా. మాట్లాడితే జగన్ అడ్డుపడుతున్నాడంటావ్. వైయస్ జగన్ ప్రజాసమస్యలపై మాట్లాడుతుంటే సభను వాయిదా వేయిస్తావ్.  ఏనాడైనా సభలో మాట్లాడేందుకు అవకాశం ఇచ్చావా.  నీ దుర్మార్గ పాలనను ప్రజలంతా చూస్తున్నారు. రాజధానిలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించకుండా మంత్రిగా తీసుకున్నావ్.  సిగ్గుగా లేదా బాబు నీకు. తెలంగాణలో  అరిచి గీ పెట్టిన నీవు ఏపీలో చేస్తున్నదేంటి..? అమరావతి
నడిబొడ్డున రాజకీయ వ్యభిచారం చేస్తున్నావ్ సిగ్గుగా లేదా బాబు నీకు.  నీపై తిరుగుబాటు చేసే రోజు దగ్గర్లోనే ఉంది. 

పూలే జయంతి రోజున బాబు  బీసీలు గుర్తుకువచ్చారు. సంవత్సరానికి 10వేల కోట్లు బీసీల ఉపప్రణాళిక ఇస్తానని చెప్పి నాలుగేళ్లలో కేవలం 7 వేల కోట్లతో సరిపెట్టిన నీవు బీసీలను మోసం చేసింది గాక ఆదరణ స్కీం పెడతావా. ఎన్నికలొచ్చేసరికి బీసీలు గుర్తుకువచ్చారా. విలువలు లేని బాబుకు పూలే, అంబేడ్కర్, జగ్జీవన్ రాం  జయంతి వేడుకల్లో పాల్గొనే అర్హత లేదు. ఎల్లుండి అంబేద్కర్ స్మృతివనంకు శంకుస్థాపన చేస్తానన్నావ్. అంబేద్కర్  ఆశయాలు తెలుసా నీకు. మైనారిటీలకు , ఎస్టీలకు ఒక్క మంత్రిపదవిని ఇవ్వలేదు.  అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని చదువుకో. ఎస్టీ, మైనారిటీలకు వెన్నుపోటు పొడిచిన నీకు బడుగు, బలహీన వర్గాల వారికి సముచిత స్థానం కల్పించేందుకు పోరాడిన అంబేద్కర్  ఎ స్మతివనం పెట్టే అర్హత నీకు లేదు. 

Back to Top