ఎమ్మెల్యే..జిందాల్‌ యాజమాన్యంతో కుమ్మక్కు


విజయనగరం: స్థానిక టీడీపీ ఎమ్మెల్యే జిందాల్‌ యాజమాన్యంతో కుమ్మక్కై తమ కడుపు కొడుతున్నారని జిందాల్‌ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 270వ రోజు విజయనగరం జిల్లా ఎస్‌.కోట నియోజకవర్గంలో కొనసాగుతోంది. మంగళవారం వైయస్‌ జగన్‌ను జిందాల్‌ కార్మికులు కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. తమకు కనీస వేతనాలు అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఏటేటా జీతాలు పెరుగుతున్నాయని, తమకు మాత్రం ఒక్క రూపాయి కూడా పెరడం లేదన్నారు. ప్రభుత్వం ఆదేశిస్తే పరిశ్రమల్లో కార్మికుల జీతాలు కూడా పెరుగుతాయన్నారు.

నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో కుటుంబ పోషణ భారంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే, జిందాల్‌ యాజమాన్యం కుమ్మక్కై కార్మికులకు అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులకు దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో రెండేళ్లకు ఒకసారి కనీస వేతనాలు అందేలా కృషి చేశారన్నారు. విద్యుత్‌ చార్జీలు పెంచడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 33 జిందాల్‌ ప్లాంట్లను ఆపేశారని, 14 నెలల తరువాత కరెంటు చార్జీలు రూ.1.50 తగ్గించి ఫ్యాక్టరీలు తెరిపించారన్నారు. అయితే తమకు కనీస వేతనం ఇవ్వడం లేదన్నారు. వారి సమస్యలు సావధానంగా విన్న వైయస్‌ జగన్‌ సానుకూలంగా స్పందించారు. 
 
Back to Top