గూడూరు (కృష్ణాజిల్లా) : జననేత శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని వివిఆర్ హౌసింగ్ సంస్థ చైర్మన్, పెడన వైయస్‌ఆర్‌సిపి నాయకుడు వాకా వాసుదేవరావు పేర్కొన్నారు. బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి పాటుపడేది ఒక్క వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీయే అని ప్రజలంతా బలంగా విశ్వసిస్తున్నారని ఆయన అన్నారు. పెడన మండలంలోని గూడూరు, పోలవరం గ్రామాల్లో బుధవారం ఆయన పర్యటించారు.
ఈ సందర్భంగా వాసుదేవరావు మాట్లాడుతూ, జగన్‌పై కాంగ్రెస్, టిడిపి కుమ్మక్కు రాజకీయాలు చేసి కుట్రతో జైలుకు పంపాయని నిప్పులు చెరిగారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డి త్వరలోనే బయటకు వచ్చి ప్రజాసమస్యలపై పోరాటం చేస్తారని వాసుదేవరావు అన్నారు. పోలవరంలో వాసుదేవరావు ఆధ్వర్యంలో 500 మంది పార్టీలో చేరారు. వారందరికీ ఆయన కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డిని సిబిఐ, కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా అరెస్టు చేయటం అన్యాయమని వాసుదేవరావు అన్నారు. 'జగన్ కోసం.. జనం సంతకం' కార్యక్రమం సందర్భంగా కోటి సంతకాల సేకరణ నియోజకవర్గంలో ముమ్మరంగా సాగుతోందన్నారు.
వైయస్‌ఆర్‌సిపిలో 100 కుటుంబాల చేరిక :'రాజన్న రాజ్యం' కోసం రాష్ట్ర ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, వైయస్‌ఆర్‌సిపి నాయకుడు జ్యేష్ట రమేష్‌బాబు అన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ జగన్మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. మండలంలోని అన్నేరావుపేటలో తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల నుంచి 100 కుటుంబాలు జ్యేష్ట ఆధ్వర్యంలో బుధవారం వైయస్‌ఆర్‌సిపిలో చేరాయి. వారికి రమేష్‌బాబు పార్టీ కండువాలను కప్పి పార్టీలోకి అహ్వానించారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా శ్రీ జగన్ ప్రభంజనాన్ని అపలేరని, త్వరలోనే ఆయన విడుదల కావడం ఖాయమన్నారు. కార్యకర్తలు అంకితభావంతో పనిచేసి స్థానిక ఎన్నికల్లో విజయం సాధించడానికి కృషిచేయాలని రమేష్‌బాబు పిలుపునిచ్చారు.