జలీల్ ఖాన్ ను కఠినంగా శిక్షించాలి

విజయవాడ: విధి నిర్వహణలో భాగంగా న్యూస్ కవరేజ్ కోసం వెళ్లిన సాక్షి పత్రిక ఫొటో జర్నలిస్ట్, వీడియో జర్నలిస్ట్‌పై దాడి చేసిన విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ పై చర్య తీసుకోవాలని కోరుతూ స్థానిక జర్నలిస్టులు తిరువురు తహసీల్దార్ కు  మెమొరాండం ఇచ్చారు.

కాగా, విధి నిర్వహణలో ఉన్న ఫొటో, వీడియో జర్నలిస్టులపై దాడి చేయడం అమానుషమని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజేయూ) జాతీయ ఉపాధ్యక్షుడు అంబటి ఆంజనేయులు మండిపడ్డారు. సమాజం మేలు కోసం పనిచేసే జర్నలిస్టులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

Back to Top