జగన్‌ విడుదల కోసం మెదక్‌లో పాదయాత్ర

మెదక్‌, 3 మార్చి 2013: జననేత, వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధ్యక్షుడు‌ శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డిని విడుదల చేయాలంటూ మెదక్‌జిల్లోలో ఆదివారంనాడు పాదయాత్ర జరిగింది. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ‌నాయకుడు సి.అంజిరెడ్డి ఆధ్వర్యంలో 3 వేల మంది అభిమానులు ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. రామచంద్రపురంలోని వైయస్‌ఆర్‌సిపి కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ పాదయాత్రను పార్టీ జిల్లా కన్వీనర్ బట్టి జగపతి జెండా ఊపి ప్రారంభించారు.

బొంతపల్లి వీరభ్రదస్వామి ఆలయం వరకు 24 కిలో మీటర్లు ‌ఈ పాదయాత్ర సాగుతుంది. పాదయాత్రలో కొండా రాఘవరెడ్డి, బి.సి. నాయకుడు సతీష్‌గౌడ్, కార్మిక నాయకుడు నర్రా భిక్షపతి పాల్గొన్నారు.

బాసరలో ప్రత్యేక పూజలు:
కాగా, శ్రీ వైయస్ జగన్మోహ‌న్‌రెడ్డి విడుదల కావాలని కోరుతూ 13 మంది యువకులు నిజామాబాద్ నుంచి ఆదిలాబాద్‌ జిల్లా బాసర వరకు పాదయాత్ర చేశారు. బాసర గోదావరిలో‌ వారు పుణ్యస్నానాలు చేశారు. అనంతరం వారంతా శ్రీ జగన్ కోసం సరస్వతీ ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించారు.‌


Back to Top