జగన్‌తోనే సంక్షేమ రాజ్యం: నారాయణస్వామి

శ్రీకాళహస్తి:

రాష్ట్రంలో సంక్షేమ రాజ్యం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్.జగన్మోహన్‌ రెడ్డితోనే సాధ్యమని పార్టీ జిల్లా కన్వీనర్ నారాయణస్వామి అన్నారు. ఆదివారం ఆయన మండలంలోని ఎగువవీధి పుట్టాలమ్మ ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయ గౌరవాధ్యక్షులు బర్రె హేమభూషణ్‌ రెడ్డి, చైర్మన్ బర్రె సుదర్శన్‌ రెడ్డి ఆధ్వర్యంలో ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ప్రజా నాయకుడు వైయస్.జగన్మోహన్‌ రెడ్డి త్వరగా విడుదల కావాలని, ఆయన సోదరి షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర విజయవంతం కావాలని అమ్మవారిని కోరుకున్నట్లు చెప్పారు. మహానేత వైయస్.రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు యథావిధిగా కొనసాగాలంటే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు.  టీడీపీ అధ్యక్షులు చంద్రబాబునాయుడు చేస్తున్న పాదయాత్ర బూటకమని విమర్శించారు.

Back to Top