జగన్‌తోనే అభివృద్ధి సాధ్యం

మానవపాడు(మహబూబ్‌నగర్):

రాష్ట్రంలో నెలకొన్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించి,సువర్ణయుగాన్ని చూ డాలన్న దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి కోరికను జగన్మోహన్‌ రెడ్డి సాధ్యంచేస్తారని కడప జిల్లా రైల్వేకోడూరు  ఎమ్మెల్యే శ్రీనివాసులు చెప్పారు. మండల పరిధిలోని కలుగొట్ల గ్రామంలో రెండోరోజు ప్రారంభమైన షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో పాల్గొని ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని పలు సమస్యలు కాంగ్రెస్ ప్రభుత్వంతోనే నెలకొన్నాయని షర్మిలతో ప్రజ లు చెప్పుకోవడం ఆశ్చర్యం కలిగిందన్నారు. వైయస్ రాజశేఖరరెడ్డి ఉన్నంత వరకు రాష్ట్రంలో ఎలాంటి సమస్యలు కనిపించలేదనీ, ఆయన మరణానంతరం ప్రజలు సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నారనీ ఆవేదన వ్యక్తంచేశారు. రాబోయే కాలంలో జగన్ ముఖ్యమంత్రయితే మళ్లీ రాజన్న రాజ్యం వస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. అడుగడుగునా తెలంగాణలో కూడా షర్మిల యాత్రకు నీరాజనం పలుకుతున్నారన్నారు. పాదయాత్రలో ఆయనతో పాటు కొల్లాపూర్ నియోజకవర్గం నాయకులు హర్షవర్దన్‌రెడ్డి, సురేష్‌గౌడ్, శ్రీనివాసులు, రామకృష్ణారెడ్డి, ఇంద్రసేనారెడ్డి పాల్గొన్నారు.

Back to Top