జగన్ ప్రభంజనాన్ని ఏ శక్తులూ అడ్డుకోలేవు

హైదరాబాద్:

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌ రెడ్డి ప్రభంజనాన్ని ఏ శక్తులు అడ్డుకోలేవని ఆ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ రాచమల్ల సిద్దేశ్వర్ స్పష్టంచేశారు. శంషాబాద్ వేళాంగని కాలనీలోని దివంగత నేత వైయస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి జన సంతకం సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ  సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్, టీడీపీ కుట్ర రాజకీయాలతోనే శ్రీ జగన్మోహన్‌ రెడ్డి జైలుకు వెళ్లారన్నారు. ఆయన విడుదల కోరుతూ చేపడుతున్న సంతకాల సేకరణకు విశేష స్పందన లభిస్తోందన్నారు. జనమంతా శ్రీ జగన్‌ను గుండెల్లో దాచుకున్నారన్నారు. సరైన సమయంలో ఆ రెండు పార్టీలకు తగిన బుద్ధి చెప్పడానికి జనమంతా ఎదురుచూస్తున్నారన్నారు. జనాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుని శ్రీ జగన్మోహన్‌ రెడ్డిని వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ శంషాబాద్, మొయినాబాద్ మండల కన్వీనర్లు టి. కుమార్‌గౌడ్, రాజయ్య, మండల యూత్ కన్వీనర్ ఎం. శివారెడ్డి, టౌన్ కన్వీనర్ అక్రమ్‌ఖాన్, నజీర్‌ఖాన్, శ్రీనివాస్, శావెలజోసఫ్, పండా, శ్రీధర్, సామెల్‌రాజ్, కాలనీవాసులు రఘునాథ్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, నర్సింహా, సబ్జిరాజు, లవకుశరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Back to Top