జగన్‌ను ఎదుర్కొనే సత్తా ఆ పార్టీలకు లేదు

హైదరాబాద్, 6 అక్టోబర్ 2‌012: జననేత వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి లోపల ఉన్నా, బయట ఉన్నా ఆయనను ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలకు లేదని ఆళ్లగడ్డ వై‌యస్ఆ‌ర్ కాంగ్రె‌స్ పార్టీ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి వ్యాఖ్యానించారు. ఆ రెండు పార్టీలూ ప్ర‌జల్లో విశ్వాసం పూర్తిగా కోల్పోయిన పార్టీలే అని ఆమె అన్నారు.

జగ‌న్మోహన్‌రెడ్డికి బెయిల్ రాకుండా చేయడానికి కాంగ్రె‌స్, టీడీపీలు ఎంతో గడ్డి కరిచి, కష్టపడ్డాయని శోభా నాగిరెడ్డి ఎద్దేవా చేశారు. జగ‌న్మోహన్‌రెడ్డి జైల్లో ఉంటే తాము చెప్పినట్లు ప్రజలు వింటారని ఆ పార్టీల నాయకులు అనుకుంటున్నాయని ఆమె అన్నారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు చేస్తున్న పాదయాత్ర వల్ల మన రాష్ట్ర ప్రజలకు ఒనగూరే లాభం ఏమీ లేదని వ్యాఖ్యానించారు. 

 రాజకీయంగా లబ్ధి పొందాలన్న ఒకే ఒక్క కోరికతో చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేస్తున్నారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ పార్టీలో పెద్దన్న పాత్ర చంద్రబాబుదే అని దుయ్యబట్టారు. ప్రజా సమస్యలు, స్థానిక ఎన్నికలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించే ధైర్యం చంద్రబాబుకు లేదని దుమ్మెత్తిపోశారు.
Back to Top