జగన్‌ను ఎదుర్కొనే శక్తి కాంగ్రెస్, టీడీపీలకు లేదు

పెరికెగూడెం: వైయస్ఆర్ సీపీ అధినేత వైయస్ జగన్మోహన్‌ రెడ్డిని ఎదుర్కొనే శక్తి కాంగ్రెస్, టీడీపీ పార్టీలకు లేదని ఆ పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు దూలం నాగేశ్వరరావు అన్నారు. పార్టీ మండల కన్వీనర్ గుమ్మడి వెంకటేశ్వరరావు ఆధ్వర్యాన పెరిడెగూడెంలో  గడపగడపకకూ వైయస్ఆర్ సీపీ కార్యక్రమం నిర్వహించారు. డీఎన్నార్ మాట్లాడుతూ తిరుగులేని ప్రజానాయకుడుగా ఎదుగుతున్న జగన్‌ను ఎలా ఎదుర్కోవాలో తెలియక అధికార, ప్రతిపక్షాలు ఏకమయ్యాయని విమర్శించారు. జగన్‌మోహన్‌ రెడ్డి బయటకు వస్తే వారి ఆటలు సాగవని సీబీఐతో కాంగ్రెస్, కేంద్రంతో టీడీపీ చేతులు కలిపి కుటిల రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ పార్టీలకు బుద్ధి చెప్పటానికి ప్రజలు ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. గ్రామస్తులు పలు సమస్యలను డీఎన్నార్‌కు వివరించగా అధికారులతో మాట్లాడి పరిష్కారానికి కృషిచేస్తానని హామీ ఇచ్చారు. పార్టీ ఆశయాలు గల కరపత్రాలను ఇంటింటికీ అందజేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు పంజా రాంబాబు, మండవల్లి మండల మహిళా కన్వీనర్ గూడపాటి ఉషారాణి, ప్రచార కార్యదర్శి  సైమన్, యువజన కన్వీనర్ పి.అనీల్, తిరుమల కొండారెడ్డి, ఆగొల్లు నాగరాజు, జి. ప్రదీప్, పి. సుబ్బారావు, బి. శేషుబాబు, కనకాచారి, రాధాకృష్ణ, జి. పద్మ, జి. ధనలక్ష్మి, లక్ష్మి పాల్గొన్నారు.

వైయస్ఆర్ సీపీలో భారీగా చేరిక
కాంగ్రెస్, తెలుగుదేశం అవలంబిస్తున్న నీచ రాజకీయాలకు ఆ పార్టీల కార్యకర్తలు విసిగిపోయి తమ పార్టీలో చేరుతున్నారని వైయస్ఆర్ సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు దూలం నాగేశ్వరరావు అన్నారు. మండల్లి మండలంలోని లింగాల, పెరికెగూడెం దళితవాడలకు చెందిన 400 మంది కార్యకర్తలు మంగళవారం వైయస్ఆర్  సీపీలో చేరారు. వారికి డీఎన్నార్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం దూలం నాగేశ్వరరావు మాట్లాడుతూ అన్నిచోట్ల ప్రజలకు జననేత జగన్‌మోహన్‌ రెడ్డి నాయకత్వంపై విశ్వాసం పెరిగుతోందని పేర్కొన్నారు. సీబీఐతో చేతులు కలిపి జగన్‌మోహన్‌ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేస్తున్న కాంగ్రెస్, టీడీపీలకు త్వరలోనే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. లింగాలకు చెందిన నాయకులు పోలగాని శివనాగరాజు, కనకాచారి, సమ్మెట వెంకన్న, డి. దేవానంద్ ఆధ్వర్యంలో, పెరికెగూడెం ఎంపీటీసీ మాజీ సభ్యులు పెరుమాళ్ల వెంకటేశ్వరరెడ్డి, జంగం ప్రకాశం, నాయకులు కె. ప్రసాద్, భూషణం ఆధ్వర్యంలో 400 మంది కార్యక ర్తలు పార్టీలో చేరారు. వైయస్ఆర్ సీపీ మండల కన్వీనర్ గుమ్మడి వెంకటేశ్వరరావు, మండల మహిళా కన్వీనర్ గూడపాటి ఉషారాణి, స్టీరింగ్ కమిటీ సభ్యుడు పంజా రాంబాబు, మండల పార్టీ ప్రచార కన్వీనర్ మేడేపల్లి సైమన్, యువజన కన్వీనర్ పోతిరెడ్డి అనిల్, తిరుమల కొండారెడ్డి, ఆగొల్లు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

Back to Top