జగన్ నాయకత్వం రాష్ట్రానికి అవసరం

జడ్చర్ల :

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం రాష్ట్రానికి అవసరమని మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ప్రముఖ సామాజికవేత్త అనిరుధ్ రెడ్డి చెప్పారు. ఈనెలాఖరున తాను పార్టీ  సభ్యత్వం తీసుకోనున్నట్లు బాలానగర్ మండలం రంగారెడ్డిగూడకు చెందిన ఆయన వెల్లడించారు. ఆదివారం ఆయన బాదేపల్లి పట్టణంలోని పాతబజార్ పీర్లమసీదువద్ద ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..ఈనెల 28, 29 తేదీల్లో హైదరాబాద్‌లో పార్టీ కార్యాలయంలో గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ సమక్షంలో పార్టీ సభ్యత్వం తీసుకోనున్నట్లు చెప్పారు. షర్మిల పాదయాత్ర జడ్చర్ల నియోజకవర్గానికి చేరుకునే సందర్భంలో ఘనస్వాగతం పలుకుతామన్నారు.  జగన్‌మోహన్‌రెడ్డి లాంటి యువనాయకత్వాన్ని బలపర్చి రాష్ట్రాన్ని ప్రగతిపథంలో పయనింపజేసేందుకు పార్టీలో చేరుతున్నానని తెలిపారు. నేటికి ప్రజలు వైయస్‌ఆర్ పాలనను గుర్తుకు తెచ్చుకుంటున్నారని, ఎవరూ ఊహించని విధంగా తెలంగాణ ప్రాంతంలోనూ ప్రజాప్రస్థానం యాత్రకు అనూహ్యస్పందన లభించటమే ఇందుకు నిదర్శనమన్నారు. ఇప్పటికే గ్రామాలనుంచి అనేకమంది పార్టీలోకి వస్తామని సంప్రదిస్తున్నారని అన్నారు. వారిలో యువత నుంచి అన్ని వర్గాల వారు ఉన్నారని పేర్కొన్నారు.

Back to Top