జగన్మోహన్ రెడ్డికి అండగా ఉంటాం

పెద్దాపురం:

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డికి  అండగా ఉంటామని పెద్దాపురం  గణేష్ నగర్‌కాలనీ ప్రజలు ప్రతిమ పూనారు. పార్టీ నేతలు చలమలశెట్టి సునీల్, తోట సుబ్బారావునాయుడు సమక్షంలో పార్టీలో చేరేందుకు ఏర్పాటు చేసిన సభకు కాలనీ ప్రజలతో పాట, సత్తెమ్మ కాలనీ, భాస్కర కాలనీ ప్రజలు విశేషంగా తరలివచ్చారు. జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు అవాల లక్ష్మీనారాయణ అధ్యక్షతన జరిగిన సభలో సభలో తోట సుబ్బారావునాయుడు మాట్లాడుతూ శ్రీ జగన్మోహన్ రెడ్డికి  బెయిల్ రాకుండా ప్రభుత్వాలు కుట్రపన్నుతున్నాయన్నారు. చలమలశెట్టి సునీల్ మాట్లాడుతూ కాలనీ ప్రజలు పార్టీలో చేరడం అభినందనీయమన్నారు. సామర్లకోట మాజీ జెడ్పీటీసీ బొబ్బరాడ సత్తిబాబు, పట్టణ పార్టీ కార్యదర్శి పెదిరెడ్ల రామకృష్ణ, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు నెక్కంటి సాయిప్రసాద్, యార్లగడ్డ జగదీష్, తూతిక నూకరాజు, ఆరెళ్ల వీర్రాఘవ ప్రసంగించారు. టీడీపీ , కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులతో పాటు సుమారు 300 మంది కాలనీ ప్రజలు సామూహికంగా పార్టీలో చేరారు. పార్టీ జిల్లా నాయకులు తాడి రాజశేఖర్, రెడ్డి లక్ష్మీ, ఎం. రమేష్‌రెడ్డి, నాగిరెడ్డి వాసు, యర్రా రాంబాబు, గౌతు శ్రీనివాసరావు, యాత్ కన్వీనర్ మామిడి శివ, పట్టణ వైఎస్సార్ సీపీ నాయకులు సిద్ది బాబ్జీ, ఎం. రమేష్‌రెడ్డి, దేవాడ శ్రీనివాస్‌రెడ్డి, వేముల పండు, కోమటి అశోక్‌కుమార్, కింతాడ కుమార్, రబ్బానీ, టి. రాజు, ఎస్సీసెల్ కన్వీనర్ బూసి రఘుకుమార్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Back to Top