జగన్మోహన్‌రెడ్డి బెయిల్ కోసం రంగారెడ్డిలో పాదయాత్ర

హైదరాబాద్, 4 అక్టోబర్‌ 2012: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డికి సుప్రీంకోర్టులో బెయిల్ రావాలని ఆకాంక్షిస్తూ రంగారెడ్డి జిల్లాలో వై‌యస్‌ఆర్‌ సీపీ కార్యకర్తలు పాదయాత్ర చేపట్టారు. ‌హైదరాబాద్‌ శివారు రాజేంద్రనగర్ మండలం కాళీ మందిర్ నుంచి పార్టీ జిల్లా అధ్యక్షుడు జనార్థ‌న్‌రెడ్డి గురువారం ఈ పాదయాత్రను ప్రారంభించారు. చిలుకూరు బాలాజీ దేవాలయం వరకు పాదయాత్ర సాగుతుందని ఆయన చెప్పారు. అంతకు ముందు కాళీ మందిర్‌లో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Back to Top