జగన్‌కోసం అభిమానుల ప్రత్యేక పూజలు

తిరుపతి: జిల్లా వ్యాప్తంగా వైయస్ జగన్‌మోహన్‌రెడ్డికి మంచి జరగాలని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, జగన్ అభిమానులు, ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యులు, ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, నగర కన్వీనర్ పాలగిరి ప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో అలిపిరిలో శ్రీవారి పాదాల వద్ద 1001 టెంకాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేశారు. జిల్లా కన్వీనర్ కె.నారాయణస్వామి, చిత్తూరు నియోజకవర్గ ఇన్‌చార్జి ఏయస్ మనోహర్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు గాయత్రిదేవి, ఎస్సీ సెల్ కన్వీనర్ కేశవులు, బీసీ సెల్ కన్వీనర్ మిద్దెలహరి కాణిపాకం వినాయకస్వామి ఆలయంలో గణపతి హోమం చేశారు. మదనపల్లె నియోజకవర్గ ఇన్‌చార్జి  ఎమ్మెల్సీ దేశాయ్ తిప్పారెడ్డి మదనపల్లె షిరిడీ సాయి మందిరంలో ప్రత్యేక పూజలు చేశారు. బడే మస్తాన్ దర్గాలో యువజన విభాగం అధ్యక్షుడు ఉదయ్‌కుమార్ ప్రార్థనలు నిర్వహించారు. మైనారిటీ నాయకులు బాబ్‌జాన్ కోర్టు గంగమ్మగుడిలో పూజలు చేశారు. చంద్రగిరి నియోజకవర్గ ఇన్‌చార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతి-చంద్రగిరి మార్గంలోని ఆంజ నేయస్వామి గుడి వద్ద 1001 గుమ్మడికాయలు కొట్టారు. జగన్‌కు దిష్టిపోవాలని, మేలు జరగాలని పూజలు చేశారు. కాళహస్తిలో బియ్యం మధుసూదన్ రెడ్డి, కంఠా రమేషన్, దశరథా చారి, లోకేష్‌యాదవ్ జగన్ కోసం శ్రీకాళహస్తీశ్వరాయలం వద్ద పూజలు చేశారు. 1001 టెంకాయలు కొట్టారు. సత్యవేడులో పార్టీ మండల కన్వీనర్ నిరంజన్ రెడ్డి గంగమ్మగుడి వద్ద టెంకాయలు కొట్టి అర్చన చేశారు. పలమనేరులో పార్టీ టౌన్ కన్వీనర్ హేమంత్‌రెడ్డి, అధికార ప్రతినిధి సుధీర్‌కుమార్, బెరైడ్డిపల్లె కన్వీనర్ కేశవులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిండ్ర షుగర్ ఫ్యాక్టరీ ఆవరణలో ఉన్న శ్రీవేంకటేశ్వర ఆలయంలో చక్రపాణిరెడ్డి ఆధ్వర్యంలో వంద మంది కార్యకర్తలు పూజలు చేసి 101 టెంకాయలు కొట్టారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని పెనుమూరులో బీసీ నాయకులు మనోహర్, సురేంద్రబాబు, వేణు, గురవయ్య ఆధ్వర్యంలో పులిగుంటీశ్వరస్వామి గుడిలో పూజలు చేశారు. ఎస్‌ఆర్‌పురం, పాలసముద్రం, కార్వేటినగరం, వెదురుకప్పం మండలాల్లో, తంబళ్లపల్లె నియోజకవర్గంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పార్టీ కుప్పం నియోజకవర్గం ఇన్‌చార్జి జెడ్పీ మాజీ చైర్మన్ ఎం.సుబ్రమణ్యం రెడ్డి, కృష్ణయ్య ఆధ్వర్యంలో గుడిపల్లెలో రాళ్లగంగమ్మను ప్రార్థించారు. జగన్ త్వరగా విడుదల కోవాలని మొక్కుకున్నారు. శాంతిపురంలో పార్టీ కన్వీనర్ రఘురామిరెడ్డి సారథ్యంలో శివాలయంలో ప్రార్థనలు నిర్వహించారు.

తాజా వీడియోలు

Back to Top