జగనన్న సీఎం అయితే కష్టాలు తీరతాయి


కొనకల (మహబూబ్ నగర్ జిల్లా): వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని మహబూబ్ నగర్ జిల్లాలోని కొనకల గ్రామ ప్రజలు ఆకాంక్షించారు. జగన్ సీఎం అయితేనే తమ సమస్యలు పరిష్కారమవుతాయని అన్నారు. మరో ప్రజా ప్రస్థానం యాత్రలో భాగంగా మహానేత తనయ,  జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల కొనకల గ్రామంలో శనివారం సాయంత్రం రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. స్థానికులు ఎదుర్కొంటున్న ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా గ్రామ ప్రజలు తమ గోడును వెళ్లబోసుకున్నారు. గ్రామంలో తాగు నీరు, విద్యుత్ సమస్య తీవ్రంగా ఉందని స్థానికులు షర్మిల దృష్టికి తీసుకు వచ్చారు. కూలి పనులు కూడా దొరకడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జగనన్న సీఎం కావాలని, అప్పుడే తమ కష్టాలు తీరుతాయని అన్నారు. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లోని నిరు పేదలు ఉన్నత చదువులు చదివే అవకాశం కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జగన్‌ను జైలులో పెట్టినంత మాత్రన తమ అభిమానాన్ని ఎవరూ ఆపలేరని అన్నారు. తామంతా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండదండగా ఉంటామని కొనకల గ్రామ ప్రజలు ముక్త కంఠంతో చెప్పారు.

ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ, ప్రజల ఆశీస్సులతో జగనన్న జైలు నుంచి త్వరలో బయటకు వస్తారని అన్నారు. రాజన్న రాజ్యాన్ని జగనన్న స్థాపిస్తాడని అన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజల కష్టాలన్నీ తీరుతాయని భరోసా ఇచ్చారు.

Back to Top