జగనన్నను సీఎం చేయడమే లక్ష్యం

పెడన:

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.యస్. జగన్మోహన్‌ రెడ్డిని ముఖ్యమంత్రి చేయటమే లక్ష్యంగా పని చేయాలని పార్టీ సేవాదళ్ జిల్లా కన్వీనర్ మావులేటి వెంకట్రాజు, పార్టీ నియోజకవర్గ నేత వాకా వాసుదేవరావు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కృష్ణా జిల్లా పెడనలోని వార్డు పార్టీ కార్యాలయంలో  ఏర్పాటైన నియోజకవర్గ పార్టీ కార్యకర్తల సర్వసభ్య సమావేశానికి పార్టీ పట్టణ కన్వీనర్ పిచ్చుక శంకర్ అధ్యక్షత వహించారు. సమావేశంలో పార్టీ నేతలు మావులేటి, వాసుదేవరావు మాట్లాడుతూ నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసేందుకు కార్యకర్తలు, నాయకులు సైనికుల్లా పని చేయాలని కోరారు. ఇటీవల జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి నియోజకవర్గంలో పార్టీ గురించి చర్చించినట్లు చెప్పారు. ఆయన పెడనలో గడప గడపకూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం, పార్టీ సభ్యత్వ నమోదును విస్తృతంగా చేయాలని సూచించినట్లు వివరించారు. దీంతోపాటు ఇడుపులపాయ ప్లీనరీలో పార్టీ ప్రవేశపెట్టిన ప్రజాహిత సంక్షేమ పథకాల గురించి ప్రజలకు తెలియజేసి పార్టీని పటిష్టపరచాలని కోరినట్లు పేర్కొన్నారు. నియోజకవర్గంలో నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పార్టీ కోసం పనిచేయాలని చెప్పారు. ప్రజల సమస్యలను తెలుసుకుని అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించే దిశగా కృషిచేయాలన్నారు.

Back to Top