అభిమానులకు జగన్‌ ఆత్మీయ పలకరింపు

హైదరాబాద్, 25 సెప్టెంబర్ 2013:

ప్రియతమ ‌మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి తనయుడు‌, జననేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డిని ప్రత్యక్షంగా చూసేందుకు రాష్ట్రం నలుమూలల నుంచీ అభిమాన జన కెరటాలు ఎగిసిపడ్డాయి. సుదీర్ఘ కాలం తరువాత యువనేత జనం మధ్యలోకి రావటంతో అభిమానుల ఆనందానికి అవధులు దాటింది. శ్రీ జగన్మోహన్‌రెడ్డి నివాసం ఉన్న ప్రాంతం లోటస్‌పాండ్ జన సంద్ర‌ంగా మారిపోయింది. తమ అభిమాన నాయకుడికి కరచాలనం చేయాలని పోటీపడింది. శ్రీ జగన్ ‌తన నివాసం నుంచి బయటకు రాగానే లోటస్‌పాండ్‌ను నినాదాలతో హోరెత్తించారు. జై జగన్‌ నినాదాలు మిన్నంటాయి. చప్పట్లు, ఈలలతో ఆ ప్రాంతం మొత్తం మారుమోగిపోయింది.

తనను చూసేందుకు, కలుసుకునేందుకు వచ్చిన వారందరికీ శ్రీ జగన్మోహన్‌రెడ్డి అభివాదం చేశారు. ఒక్కొక్కరిగా ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించారు. ఎలా ఉన్నారంటూ ప్రేమగా అడిగారు. ఆప్యాయంగా పలకరించారు. సమస్యలు విన్నారు.. విజ్ఞప్తులు స్వీకరించారు. ప్రతి ఒక్కరికీ  ధైర్యం చెప్పారు.

శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డిని చూసేందుకు వచ్చిన వారిలో విద్యార్ధులు అధిక సంఖ్యలో ఉన్నారు. ప్రాంతాలకు అతీతంగా తరలివచ్చిన అభిమానులతో లోటస్‌పాండ్ కోలాహలంగా మారింది. చేతులు పట్టుకుని బాగున్నారా అన్నా..‌ బాగున్నావా తమ్ముడు... అంటూ శ్రీ జగన్ పలకరించారు. విద్యార్థులందరికి మంచి భవిష్యత్తు ఉంటుందని వారికి ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. అందరికీ ఆయన కొండంత భరోసా ఇచ్చారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top