వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వస్థలమైన పులివెందులలో పర్యటిస్తున్నారు. బెంగళూరు నుంచి నేరుగా రోడ్ మార్గంలో పులివెందులకు చేరుకొన్నారు. సతీమణి వైఎస్ భారతీ రెడ్డి తో కలిసి నేరుగా పార్టీ సీనియర్ నేత, చిన్నాయన వైఎస్ భాస్కర్ రెడ్డి ఇంటికి వెళ్లారు. అనారోగ్యంతో ఇంటి దగ్గర విశ్రాంతి తీసుకొంటున్న భాస్కర్ రెడ్డిని పరామర్శించారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డితో ఆరోగ్య పరిస్థితిని వాకబు చేశారు. ఆ తర్వాత వైఎస్ జగన్ తన ఇంటికి చేరుకొన్నారు. జగనన్న వస్తున్నారని తెలిసి చుట్టు పక్కల గ్రామాల నుంచి అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకొన్నారు. వారందరినీ ఓపిగ్గా పలకరించి కుశల ప్రశ్నలు వేశారు.