పట్టిసీమ వల్ల పోలవరానికి ప్రమాదం: వైఎస్ జగన్

ప‌ట్టి సీమ తో పోల‌వ‌రానికి ముప్పు ఏర్ప‌డుతుంద‌ని వైఎస్సార్‌సీపీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అభిప్రాయ ప‌డ్డారు. దీనిపై ఆయ‌న కేంద్రానికి విన‌తి ప‌త్రం ఇచ్చారు. కేంద్ర  ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో    వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమావేశం అయ్యారు. అనంతరం వైఎస్ జగన్ విలేకరులతో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీకి వివరించిన అంశాలను అరుణ్జైట్లీకి వివరించినట్లు చెప్పారు. పట్టిసీమ వల్ల పోలవరం కోల్డ్స్టోరేజీకి వెళ్లే ప్రమాదం ఉందని చెప్పినట్లు తెలిపారు. పట్టిసీమలో ఎక్సెస్ టెండర్లు వేసిన అంశాన్ని కూడా మంత్రి దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. పోలవరం ప్రాజెక్టుపై తమ ఆందోళనను మంత్రి ముందు ఉంచినట్లు చెప్పారు. ఎలాంటి రిజర్వాయర్ లేకుండా కేవలం డబ్బు కోసం ఈ టెండర్లు పిలిచినట్లు తెలిపారు.
Back to Top